టాప్ లేచిపోద్ది: ప్రత్యేక హోదాపై వెలిసిన వివాదాస్పద పోస్టర్లు
గుంటూరు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై గుంటూరు నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే డొక్క చీలుస్తాం, టాప్ లేచిపోద్ది, రంగు పడుద్దంటూ కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతో నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
శంకర్‌విలాస్ సెంటర్, అరన్నల్ పేట ఓవర్‌బ్రిడ్జ్‌లపై పెట్టి ఈ ప్లెక్సీలు సంచలనంమ సృష్టిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై పలు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదనే విషయం క్రమంగా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలిశాయి.

ఎపి రాజధానిలో భూసేకరణను వెంటనే నిలిపివేయాలంటూ యువజన కాంగ్రెస్ సభ్యులు విజయవాడ నగరంలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. వివిధ కళారూపాలతో యువజన సభ్యులు ప్రదర్శనలిచ్చారు.
బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని అలాంటి రైతులకు తాము అండగా ఉంటామన్నారు. మరోవైపు ఆందోళనకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications