ప్రేమజంటలతో ఇలా గుంజిళ్లు తీయించారు (పిక్చర్స్)
హైదరాబాద్: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట, సెవన్‌టూంబ్స్‌ను సందర్శించేందుకు వచ్చిన ప్రేమ జంటలను గోల్కొండ పోలీసులు గుంజిళ్లు తీయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను రోజుల క్రితం గోల్కొండ కోట, సెవన్ టూంబ్స్‌ను సందర్శించేందుకు వచ్చిన ప్రేమ జంటలను పోలీసులు కౌనె్సలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే యువతి, యువకులు వ్యసనాలకు గురికాకుండా వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా గోల్కొండ కోట సందర్శనకు వచ్చే ప్రేమ జంటల చేష్టలు అసభ్యంగా ఉంటున్నాయని పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోల్కొండ పోలీసులు ప్రేమ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇలాంటి పనులు ఇక ముందు చేయకుండా వారిని గుంజిళ్లు తీయించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. పోలీసులు అతిగా ప్రవర్తించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రజా సంఘాలు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి.

గుంజిళ్లీ 1
ప్రేమజంటల పట్ల పోలీసులు గోల్కొండ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావు ఇస్తోంది. ప్రేమికలకు కౌన్సెలింగ్ చేసే ఉద్దేశంతో వారి చేత గంజిళ్లు తీయించారు.

గుంజిళ్లు 2
గోల్కొండ కోట చూసేందుకు వచ్చిన యువజంటలపై పోలీసులు ప్రేమికుల చేత బహిరంగంగా పోలీసులు గుంజీళ్లు తీయించడం వివాదానికి కారణమైంది. మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

గుంజిళ్లు 3
ఇనస్పెక్టర్ సయ్యద్ నజీముద్దీన్ ఒంటరిగా ఉన్న యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని గుంజీళ్లు తీయించారు. అమ్మాయిలని కూడా చూడకుండా విపరీతంగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి.

గుంజిళ్లు 4
ప్రేమికుల చెంపలు కూడా పోలీసులు వాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రుల కళ్లు గప్పి పెడదారి పడుతున్న వారికి బుద్ధిచెప్పేందుకే ఇలా చేశామని ఇన్‌స్పెక్టర్ సయ్యద్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు.

గుంజిళ్లు5
పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరి మధ్యలో వారిని ఇలా అవమానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

గుంజిళ్లు 6
గుంజిళ్ల వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి ప్రదర్సించారు. పాతబస్తీ ప్రజలు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications