బెజవాడలో కాల్పుల కలకలం: గోదావరిలో సజీవదహనం

ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తి మరుగుదొడ్డిలోకి వెళ్లిన కాసేపటికి అతని చేతిలో ఉన్న తుపాకీ పేలింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటరమణ తొడలోకి తుపాకీ తూటా దూసుకుపోయింది. అక్కడే పని చేస్తున్న వ్యక్తులు వెంటనే కాల్పులకు కారణమైన ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
కృష్ణ లంక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఒకరు పూజారీ అని తెలుస్తోంది. పోలీసులు ఎనిమిది రౌండ్ల బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అగ్ని ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం దుర్గా థియేటర్ సమీపంలోని ఒక పూరి గుడిసె లో సోమవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒకే కుటుంబానికి వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.












Click it and Unblock the Notifications