వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు .. తాజాగా 997 కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య , మరణాల సంఖ్య పెరుగుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కఠినంగా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 997 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీరూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీ

 గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు

గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు

గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 ,99,812 కు చేరుకుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు వివరాలు చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏపీలో కేసుల పెరుగుదల ఏపీ వాసులకు ఆందోళన కలిగిస్తుంది .

జిల్లాల వారీగా కేసుల వివరాలివే

జిల్లాల వారీగా కేసుల వివరాలివే

గుంటూరు జిల్లాలో 151 కేసులు, కృష్ణాజిల్లాలో 110 కేసులు, అనంతపురం జిల్లాలో 57 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 45 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 28 కేసులు, కర్నూలులో 82 ,నెల్లూరులో 84, ప్రకాశంలో 41 కేసులు , శ్రీకాకుళం జిల్లాలో 61, విశాఖపట్నంలో 139 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 997 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,104 కేసులు ఉండగా, కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,86,498 గా ఉంది.

గత 24 గంటల్లో ఐదుగురు మృతి , మొత్తం మృతుల సంఖ్య 7,210

గత 24 గంటల్లో ఐదుగురు మృతి , మొత్తం మృతుల సంఖ్య 7,210

ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,210కి చేరుకుంది . ఇక కరోనా నుండి గత 24 గంటల్లో 282 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని, మాస్కులు ధరించకుండా ఎవరు బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వం కోరుతోంది.

English summary
During the last 24 hours, 31,324 samples were tested and 997 new cases and five deaths were reported. This brings the number of corona cases in the current state of Andhra Pradesh to 8,99,812. Andhra Pradesh has the highest number of corona cases with 181, the highest being in Chittoor district. Vizianagaram district recorded the lowest number of four cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X