ఏపీలో ఉధృతంగా కరోనా .. కొత్తగా 1184 కేసులు, 4 మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. భారతదేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,184 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 9,01,989

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 9,01,989

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం తాజాగా నమోదైన 1,184 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,01,989 కి చేరింది. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారికి రాష్ట్రంలో నలుగురు బలైపోయారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా మరణాలతో ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7, 217 కు చేరుకుంది.

గుంటూరు జిల్లాలో భారీగా నమోదైన కేసులు .. ఒక్క రోజే 352 కేసులు

గుంటూరు జిల్లాలో భారీగా నమోదైన కేసులు .. ఒక్క రోజే 352 కేసులు

ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులని చూస్తే గుంటూరు జిల్లాలో 352 ,విశాఖపట్నం జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణాజిల్లాలో 113 , నెల్లూరు జిల్లాలో 78 , అనంతపూర్ జిల్లాలో 66 , కర్నూలు జిల్లాలో 64, వైయస్సార్ కడప జిల్లాలో 62 , శ్రీకాకుళం జిల్లాలో 47 , ప్రకాశం జిల్లాలో 45, తూర్పు గోదావరి జిల్లాలో 26, విజయనగరం జిల్లాలో 19 , పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.

 రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,338

రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,338

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 456 మంది పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,338గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,50,83,179 నమూనాలను పరీక్షించినట్లుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని , కరోనా కట్టడికి అందరూ కలిసి సంయుక్తంగా పోరాటం చేయాలని , బాధ్యతాయుతంగా ప్రవర్తించారని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+