ఏపీలో కరోనా బీభత్సం: తాజాగా 13,819 కొత్తకేసులు; 12మరణాలు, అత్యధిక కేసులు ఆ జిల్లాలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇటీవల కాలంలో నిత్యం 10 వేలకు మించి కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46, 929 కరోనా శాంపిల్స్ ను పరీక్ష చెయ్యగా 13,819మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తుంది. మునుపటి రోజుతో పోలిస్తే కాస్త కరోనా కేసులు తగ్గినట్టు కనిపిస్తుంది. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 5,716మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా నేటి వరకు రాష్ట్రంలో 3,22,34,226 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.

కరోనాతో ఏపీలో గత 24 గంటల్లో 12 మంది మృతి
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు మరియు విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తం కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 12 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా రోజువారీ కేసుల వివరాల్లోకి వెళితే

జిల్లాల వారీగా కరోనా రోజువారీ కేసుల లెక్క ఇదే
అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో 1345 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 436 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1001 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 1422 కరోనా కొత్త కేసులు, వైయస్సార్ కడప జిల్లాలో 1,083 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 748 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 1255 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 1305 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 1589 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 568 కరోనా కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1988 కరోనా కేసులు, విజయనగరం జిల్లాలో 435 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 644 కరోనా కేసులు నమోదయ్యాయి.

విశాఖ జిల్లాలో కరోనా బీభత్సం .. లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1988 కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 435 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత 1,01,396 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. కరోనా మహమ్మారి తో పోరాడుతూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14561 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో ఆందోళన నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ వల్లే థర్డ్ వేవ్ .. అలెర్ట్ అంటున్న ప్రభుత్వం
కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నట్లుగా చెబుతున్నారు. తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా కేసులు మాత్రం విపరీతంగా వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపద్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసులు పెరుగుదల ప్రధానంగా కనిపిస్తుంది. కరోనా ఆందోళనకర వైవిధ్యమైన ఒమిక్రాన్ వేరియంట్ వల్లే ఇంత పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications