తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారికి కరోనా ఎఫెక్ట్ ... భారీగా తగ్గిన స్వామి హుండీ ఆదాయం, ఏకంగా 800 కోట్లు నష్టం !!

|
Google Oneindia TeluguNews

తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. వెంకటేశ్వరుడి హుండి ఆదాయాలపై కరోనావైరస్ కారణంగా చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం భారీ ప్రభావాన్ని చూపింది. దేశంలోని అత్యంత సంపన్న హిందూ దేవాలయం అయిన తిరుమలలో గత ఏడాది కాలంలో హుండి ఆదాయం రూ .800 కోట్లకు పైగా నష్టపోయినట్టు సమాచారం.

గతేడాది కరోనా దెబ్బకు బాగా తగ్గిన స్వామి ఆదాయం

గతేడాది కరోనా దెబ్బకు బాగా తగ్గిన స్వామి ఆదాయం

2020 ఫిబ్రవరిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్ట్ బోర్డు తన 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూ .3,310 కోట్లకు ఆమోదించింది. ఇది హుండి రాబడిని 1,351 కోట్ల రూపాయలుగా చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల కాలంలో కరోనా లాక్డౌన్ ప్రభావంతో స్వామి వారి ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా లాక్డౌన్ కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం 84 రోజుల పాటు మూసివేయబడింది. గత సంవత్సర కాలంగా తిరుమలలో విధించిన కరోనా లాక్డౌన్, ఆ తర్వాత తిరుమలకు భక్తులు పెద్దగా వెళ్లకపోవడం, కరోనా లాక్డౌన్ నిబంధనలు, భక్తులను అధిక సంఖ్యలో అనుమతించకపోవడం వంటి అనేక కారణాలు స్వామి వారి ఉండి ఆదాయం తగ్గడానికి కారణమయ్యాయి .

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో బాగా తగ్గిన ఆదాయం

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో బాగా తగ్గిన ఆదాయం


గతేడాది 2020 మార్చి 21వ తేదీన తిరుమల ఆలయాన్ని కరోనా నేపథ్యంలో మూసివేసిన ఆలయ సిబ్బంది మళ్లీ గత సంవత్సరం జూన్ 11న తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో తిరుమలకు వెళ్లడంతో భక్తుల కానుకలు స్వామి వారి హుండీ లో పెద్దగా లేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా, ఏడాది పొడవునా పరిమిత సంఖ్యలో భక్తులను మాత్రమే అనుమతించారు, తద్వారా హుండి ఆదాయం, టిటిడి యొక్క ఇతర ఆదాయాలపై కూడా ఇది ప్రభావం చూపింది.

సాధారణంగా నిత్యం రూ .3 కోట్ల నుంచి రూ .4 కోట్ల హుండీ ఆదాయం

సాధారణంగా నిత్యం రూ .3 కోట్ల నుంచి రూ .4 కోట్ల హుండీ ఆదాయం


సాధారణంగా, తిరుమల దేవాలయంలో రోజుకు దాదాపు 60,000-90,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు . ప్రత్యేక రోజులు మరియు వారాంతాల్లో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది. హుండిలోకి భక్తులు వేసే కానుకల ద్వారా ఈ పుణ్యక్షేత్రం రోజుకు రూ .3 కోట్ల నుంచి రూ .4 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. నెలవారీ హుండీ ఆదాయం రూ .100 కోట్ల నుండి రూ .150 కోట్ల మధ్య ఉంటుంది. కరోనావైరస్ కారణంగా రోజుకు అనుమతించే భక్తుల సంఖ్యపై విధించిన ఆంక్షలు హుండి ఆదాయంపై భారీ ప్రభావాన్ని చూపాయి.

అధికారిక రికార్డుల ప్రకారం గత ఏడాది స్వామి వారి ఆదాయ లెక్కలు ఇవే

అధికారిక రికార్డుల ప్రకారం గత ఏడాది స్వామి వారి ఆదాయ లెక్కలు ఇవే


అధికారిక రికార్డుల ప్రకారం, గత సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో, హుండి ఆదాయం వరుసగా రూ .10.50 లక్షలు మరియు రూ .35.97 లక్షలు, అప్పుడు భక్తులు ముడుపులు ఆన్లైన్ ద్వారానే చెల్లించారు. కరోనా మహమ్మారి నేపద్యంలో అప్పుడు ఆలయం పూర్తిగా మూసివేయబడింది. జూన్ 8 న యాత్రికుల కోసం తిరిగి తెరిచిన తరువాత, ఆ నెలలో హుండి ఆదాయం రూ .1.1 కోట్లకు, జూలైలో రూ .16.69 కోట్లు, రూ. 18.43 కోట్లు ఆగస్టులో, రూ. 32.04 కోట్లు సెప్టెంబర్‌లో, రూ. 47.52 కోట్లు అక్టోబర్‌లో, నవంబర్‌లో రూ. 61.29 కోట్లు. గత ఏడాది డిసెంబర్‌లో హుండి ద్వారా భక్తుల నుండి రూ .79.64 కోట్లు వసూలు చేయడంతో సాధారణ స్థితికి వచ్చింది.

2021 సంవత్సరంలో హుండీ ఆదాయం ఇలా

2021 సంవత్సరంలో హుండీ ఆదాయం ఇలా


ఇక 2021 సంవత్సరంలో జనవరిలో రూ.83.92 కోట్లకు, ఫిబ్రవరిలో రూ .90.45 కోట్లకు, మార్చిలో రూ .104.42 కోట్లకు స్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది . కోవిడ్ -19 రెండవ వేవ్ మరోమారు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతించే భక్తుల సంఖ్యపై మరోసారి ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ విధంగా హుండి ఆదాయం మళ్లీ ఏప్రిల్‌లో రూ .62.69 కోట్లకు పడిపోయింది. మేలో రూ .11.95 కోట్లకు తగ్గింది. అయితే జూన్‌లో స్వామి వారి హుండీ ఆదాయం కాస్త పెరిగి రూ. 36.01కోట్లుగా ఉంది.

English summary
Coronavirus-induced financial crisis has had a huge impact on Hundi revenues of Lord Venkateswara at Tirumala. In all, the richest Hindu temple in the country lost more than Rs 800 crore in Hundi collections during the past one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X