వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగురాష్ట్రాల్లో విధుల్లో వయసు పైబడిన పోలీసులకు కరోనా ఫియర్ .. సెలవివ్వాలని విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది.కానీ కరోనా కేసులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ముంబై లో లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపధ్యంలో మిగతా రాష్ట్రాల పోలీసులకు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడిన వారికి లాక్ డౌన్ విధులు ఒకింత భయం కలిగిస్తున్నాయి.

కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో వయసు పై బడిన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో వయసు పై బడిన పోలీసులు

ఒక్క ముంబై లోనే కాదు దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ కాస్త వయసు పై బడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అసలే ఎండా కాలం , అందులోనూ కొందరు దీర్ఘకాలిక వ్యాదులైన షుగర్ , బీపీలతో బాధ పడుతున్నారు. ఇక అలాంటి వాళ్ళు ఇప్పుడు విధులు నిర్వర్తించాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వారికి కరోనా వస్తే రికవర్ అయ్యే ఛాన్సులు దాదాపు తక్కువ వున్నా నేపధ్యంలో వారు భయపడుతున్నారు. గత మూడు రోజులలో ముగ్గురు ముంబై పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన నేపధ్యంలో ఉన్నతాధికారులు ఈ 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సెలవు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా సోకుతుందన్న భయంతో ముంబై తరహాలో సెలవుకై వినతి

కరోనా సోకుతుందన్న భయంతో ముంబై తరహాలో సెలవుకై వినతి

ఇక తెలుగు రాష్ట్రాలలోని పోలీసులు సైతం ఈ తరహా నిర్ణయం తమ విషయంలో కూడా తీసుకుంటే బాగుండు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవాలని వారు అనుకోవటం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంలో ఆలోచించాలని కోరుతున్నారు. కరోనా ముఖ్యంగా వయసు పై బడిన వారిపై ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్న నేపధ్యంలో వారు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. ఒకపక్క కరోనా వైద్యులను, వైద్య సిబ్బందిని కబళిస్తుంది. కొందరు పోలీసులు సైతం కరోనా మహమ్మారికి బలైపోయారు. ఇక ఈ నేపధ్యంలో తమను డేంజర్ జోన్ లో పడెయ్యకుండా పోలీసులు ఉన్నతాధికారులు సెలవు ఇప్పిస్తే కాస్త సేఫ్ జోన్ లో ఉంటామని వారంటున్నారు.

Recommended Video

COVID-19 : Coronavirus Didn't Even Leave Supreme Court,1 Test Positive,2 In Quarentine
 మానసిక ఆందోళనతో అనారోగ్యం .. పోలీస్ బాస్ లు ఆలోచిస్తారా ?

మానసిక ఆందోళనతో అనారోగ్యం .. పోలీస్ బాస్ లు ఆలోచిస్తారా ?


ఒక పక్క ఎండాకాలం కావటంతో రోడ్లపై విధులు నిర్వర్తించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఎండ దెబ్బకు అనారోగ్యానికి గురవుతున్నారు. రేపో మాపో రిటైర్ అవుతారనుకున్న వారు సైతం కరోనా లాక్ డౌన్ విధుల్లో పని చెయ్యాల్సి వస్తుంది. ఇక బయట కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితులు , ఇంకోపక్క కరోనా ఎక్కడ తమకు వస్తుందో అన్న భయం వెరసి చాలా మంది 50 ఏళ్ళు పైబడిన పోలీసులు టెన్షన్ లో ఉన్నారు . ఇక ఈ పరిస్థితుల నేపధ్యంలో వారి మానసిక , శారీరక పరిస్థితిని అర్ధం చేసుకుని కరోనా బారిన పడి పోలీసులు మృతి చెందక ముందే ముంబై పోలీసుల తరహా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
The second phase of the lock down continues throughout the country. The highest number of cases are reported in Maharashtra. The rest of the states police are holding tension as Mumbai's police, which is carrying out lockdown duties, are also affected by corona. Lockdown functions are especially dangerous for those over 50 years of age.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X