విజృంభిస్తోన్న కరోనా? ముంబయిలో ఒకరి నుంచి 9 మందికి వ్యాప్తి?
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా పాజిటివిటీ రేటు 8.4 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 3712 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇవే అత్యధిక కేసులు. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం 19వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

తాజాగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే రెండువేల చొప్పున నమోదయ్యాయి. ఇక్కడ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి చేరింది.2020 మొదట్లో కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి తాజాగా నమోదైన కేసులతో కలిసి 4.31 కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 4.26 కోట్ల మంది ఈ వైరస్ పై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 193.7 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications