ఏపీలో కరోనా: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఇప్పటిదాకా ఎవరూ చేయని పని.. లాక్ డౌన్ పొడగింపుపైనా..
కరోనా వైరస్ విజృంభణ మొదలైన చాలా కాలందాకా సేఫ్ గా కనిపించిన ఆంధ్రప్రదేశ్‌లో.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదివారం కొత్తగా మరో 34 కేసులు నమోదుకావడంతో మొత్తంగా కొవిడ్-19 పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 226కు పెరిగింది. ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు చనిపోయారని వార్తలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఒక్క మరణాన్నే(విజయవాడ వ్యక్తి) ధృవీకరించింది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనాపై సమీక్ష..
ఆదివారం నాటికి ఏపీలో 34 కొత్త కేసులు నమోదయ్యాయని, మొత్తంగా సంఖ్య 226కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు చేశారు. ఈ మీటింగ్ లో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నదాధికారులు హాజరయ్యారు. అందులో..

దేశంలోనే తొలిసారి..
ఇప్పటిదాకా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో.. కొవిడ్-19 రోగులకు చికిత్స ప్రత్యేక ఆస్పత్రుల్లోనే చికిత్స కొనసాగుతున్నది. ఏపీలోనూ ఆయా జిల్లా కేంద్రాల్లోని పెద్దాసుపత్రుల్లో గల కరోనా వార్డుల్లోనే చికిత్స అందిస్తూవస్తున్నారు. కానీ ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలంటూ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పడకల సౌకర్యం ఉన్న అన్ని ఆస్పత్రుల్లో దేన్నీ వదలకుండా.. అన్ని చోట్లా ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ తరహాలో రాష్ట్రమంతటా కరోనా వార్డుల్ని ఏర్పాటు చేయనుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడంతో జగన్ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇంకా..

ఇకపై అన్ని జిల్లాల్లో..
కొవిడ్-19 కేసుల నిర్ధారణలో వైరాలజీ ల్యాబ్స్ కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ల్యాబ్స్ అన్నీ కలిపి రోజుకు దాదాపు 1లక్షకుపైగా అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని చోట్లా ల్యాబ్స్ పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించాయి. జిల్లాకు కనీసం ఒక్కటి చొప్పున, పెద్ద జిల్లా అయితే ఒకటికి మించి ల్యాబ్స్ ఏర్పాటుకు కావాల్సిన పనుల్ని యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. దీంతోపాటు, ఇప్పటికే అందుబాటులో ఉన్న ల్యాబ్స్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.

దేన్నీ తేలికగా తీసుకోవద్దు..
ఏపీలో కోరనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై ఏ చిన్న అంశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని, సబంధిత లక్షణాలతో ఎవరొచ్చినా.. కొవిడ్ పేషెంట్ గానే భావించి, ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ చెప్పారు. దీనికి సంబంధించి ఇదివరకే జారీ చేసిన గైడ్ లైన్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. సీఎం జగన్ ఆదేశించారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవాళ్ల ద్వారా ప్రైమరీ కాంటాక్ట్స్ గా భావిస్తోన్న వ్యక్తులందరికీ కరోనా టెస్టులు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని చెప్పారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ కొనసాగింపుపై నర్మగర్భంగా..
ఏపీతోపాటు దేశమంతటా కొవిడ్-19 కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో.. ఈ నెల 14 లోగా పరిస్థితులు చక్కబడకుంటే లాక్ డౌన్ కొనసాగింపు ఖాయమనే భావన వ్యక్తమవుతుండటం, ఏప్రిల్ 30దాకా లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు నోయిడా అధికారులు ఉత్తర్వులు జరీచేయడం, మహారాష్ట్ర సర్కారు కూడా కొనసాగింపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై ఏపీ సీఎం నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ కు సంబంధించి ఈనెల 14 తర్వాత కేంద్రం ప్రకటించబోయే మార్గదర్శకాలకు తగినట్లు ముందే ప్రిపేర్ కావాలని అధికారులకు జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications