వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో క్వారంటైన్ సక్సెస్- నెల్లూరు బాధితుడికి విముక్తి, మరో నలుగురు అనుమానితులూ ఇంటికి..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న క్వారంటైన్ చికిత్స సత్ఫలితాలు ఇస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిబంధనల మేరకు ప్రభుత్వం అందిస్తున్న క్వారంటైన్ విజయవంతం కావడంతో నెల్లూరులో కరోనా పాటిజివ్ గా తేలిన విద్యార్ధి రెండు వారాల తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. అలాగే మరో నలుగురు అనుమానితులకు కూడా కరోనా లేదని తేలడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు..

నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు..

ఏపీలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నిర్ధారణ అయిన నెల్లూరు విద్యార్ది ఎట్టకేలకు కోలుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన విద్యార్ధికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన అధికారులు 6వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి ప్రత్యేక క్వారంటైన్ చికిత్స అందించారు. వైద్యం కొనసాగిస్తూనే రెండుసార్లు అతని శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పంపారు. రెండు వారాల తర్వాత రెండు శాంపిల్స్ కూడా నెగెటివ్ గా తేలడంతో క్వారంటైన్ విజయవంతమైనట్లు గుర్తించి అతన్ని ఇంటికి పంపారు. అయితే మరో రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు అతనికి సూచించారు.

బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు..

బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు..

ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు విద్యార్ధికి కరోనా పాజిటివ్ గా తేలినా ప్రభుత్వం ఆస్పత్రిలో ఉంచి అన్ని జాగ్రత్తలతో క్వారంటైన్ నిర్వహించడంతో అతను కోలుకున్నాడు. రెండు వారాల తర్వాత అతను ఇంటికి కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడు మిగతా బాధితుల్లోనూ ఇది ధైర్యం నింపుతోంది. అధికారులు చెప్పినట్లు విని క్వారంటైన్ కు సహకరిస్తే కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినా సరే బయట పడొచ్చని ఈ ఉదంతం నిరూపిస్తోంది. దీంతో మిగతా బాధితులు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. మరో వారం గడిస్తే వీరి పరిస్దితిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు.

Recommended Video

AP Lock down: 2.5 Lakh Volunteers In AP To Screen Eevery Household | Bhadradri Kothagudem DSP Issue
 నలుగురు అనుమానితులకూ విముక్తి...

నలుగురు అనుమానితులకూ విముక్తి...

నెల్లూరు పాజిటివ్ కేసును విజయవంతంగా క్వారంటైన్ చేయగలిగిన వైద్యులు.. ఏపీలో మరో నలుగురు కరోనా వైరస్ అనుమానితులను కూడా ఇదే ప్రక్రియ ద్వారా రక్షించారు. వీరికి కూడా శాంపిల్స్ టెస్ట్ తర్వాత ఎలాంటి లక్షణాలు లేవని నిర్దారణ కావడంతో ఇళ్లకు పంపినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి పలు అనుమానిత కేసుల్లోనూ త్వరలో మరికొందరికి క్వారంటైన్ పూర్తి చేసి ఎలాంటి లక్షణాలు లేవని తేలితే ఇళ్లకు పంపించాలని అధికారులు భావిస్తున్నారు.

English summary
due to ap govt's quarantine measures first identified coronavirus postive patient has been recovered now. ap health department officials successfully qurantined him and samples tested two times beforesent him home. another four suspect cases also recoved and sent home yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X