కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు! గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కుర్చీ కోసం ఈ గొడవ జరగడం గమనార్హం. ప్రతిపక్ష నాయకుడు కూర్చునే కుర్చీ విషయంలో ఏర్పడిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ఎక్కువైందంటున్నారు.
సమావేశ మందిరంలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఒకరి పైన ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. భమా గన్‌మన్, ఇద్దరు టీడీపీ వారికి గాయాలయ్యాయని తెలుస్తోంది.

పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కౌన్సిలర్ల దాడితో మున్సిపల్ కార్యాలయం రణరంగంగా మారింది. కాగా, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పైన కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications