ఏపీలో పోలింగ్ ను మించిన కౌంటింగ్ టెన్షన్..! ఇంటెల్ రిపోర్ట్స్ తో అలర్ట్..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీ స్దాయిలో పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేశారు. ప్రధాన పార్టీలు పోలింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకంగా 82 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు ఆయా పార్టీలను టెన్షన్ పెడుతోంది. పోలింగ్ సరళి మాకు అనుకూలమంటే మాకు అనుకూలమంటూ పైకి చెప్పుకుంటున్న నేతలకు లోలోపల మాత్రం ఫలితాలపై టెన్షన్ పెరుగుతోంది.
అదే సమయంలో రాష్ట్రంలో పోలింగ్ రోజు పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, వాటిపై ఈసీ తీసుకుంటున్న కఠిన చర్యలు, మరోవైపు నిఘా వర్గాల నివేదికలు నేతల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసపై తీవ్రంగా స్పందించిన ఈసీ పలువురు కీలక అధికారుల్ని సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ వేటు కూడా వేసింది. అంతే కాదు సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ నివేదిక కూడా ఇప్పటికే డీజీపీకి అందింది.

అయితే ఇదంతా ఓ ఎత్తు.. ఇకపై జరిగేది మరో ఎత్తు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం నిఘా వర్గాల నుంచి వస్తున్న హెచ్చరికలే. ముఖ్యంగా కౌంటింగ్ కు ముందు నుంచే రాష్ట్రంలో పలు చోట్ల హింస ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. అందులోనూ పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం వంటి చోట్ల కూడా హింసకు అవకాశం ఉందంటూ అందిన నిఘా అలర్ట్స్ రాష్ట్రంలో పోలీసుల్ని సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో కౌంటింగ్ పై టెన్షన్ మరింత పెరుగుతోంది.
ఇప్పటికే కౌంటింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పార్టీలు... ఎక్కడైనా తేడా వస్తే మాత్రం రెచ్చిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ పార్టీలు ఏ స్దాయిలో అలర్ట్ గా ఉన్నాయో అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఈసారి కసిగా జరిగిన పోలింగ్ రేపు ఏదైనా ఫలితాల్లో తేడా వస్తే హింసకు కూడా కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications