ఏపీలో కౌంటింగ్ టెన్షన్- పలు చోట్ల ఆంక్షలు-అనంతలో క్రాకర్స్ బ్యాన్..!

ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కౌంటింగ్ సందర్భంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలు టెన్షన్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఈసారి ఫలితాల్లో తేడా వస్తే రాజకీయ పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికల మధ్య పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. దీంతో పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిలాల్లో హింస చెలరేగింది. దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఆ తర్వాత ఈసీ సీరియస్ కావడంతో మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు. చివరికి సీఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటయ్యాక కూడా పోలీసులు హింసాత్మక ఘటనలపై చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

counting day tension in ap as police restrictions including crackers ban in several districts

ఈ క్రమంలోనే పల్నాడు, తిరుపతి జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వంటి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈ ఘటనల ప్రభావం కౌంటింగ్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తున్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకూ ఇది అమల్లో ఉండబోతోంది.

అలాగే అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వాడకంపైనా నిషేధం విధించాలని ఎస్పీ గౌతమీశాలి చేసిన సిఫార్సును కలెక్టర్ ఆమోదించారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు. అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్ధులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తున్నారు. వీటితో పాటు అప్పటి పరిస్ధితులను బట్టి మరిన్ని ఆంక్షలు విధించే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+