ఫామ్‌హౌస్‌లో దంపతులపై దాడి: నగదు, నగలు దోపిడీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శ్రీనగర్‌లో గల ఓ ఫామ్‌హౌస్‌లో ఉంటున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. నగలు, నగదు ఎత్తుకుపోయారు. ఆరుగురు దుండగులు కత్తులు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశంచి, చంపుతామని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ముఠా కారులోనూ, ద్విచక్రవాహనంపై వచ్చింది.
దోపిడీకి గురైన దంపతులు వెంకటేశ్వర రావు (66), ధనలక్ష్మి (55) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లికి చెందినవారు. ఫామ్‌హౌస్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కుమారుడితో వారు ఉంటున్నారు. దోపిడీ జరిగిన సమయంలో ఫామ్‌హౌస్‌లో వారిద్దరు మాత్రమే ఉన్నారు.
ముఠా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించారు. ఫామ్‌హౌస్‌కు రక్షణగా ఉన్న కుక్క అత్తపై మొదట ముఠా సభ్యులు దాడి చేశారు. ముఠా సభ్యులు తొలుత వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉంటున్న గది తలుపులు తట్టారని పోలీసులు చెప్పారు.

తలుపు తీయగానే దుండగులు వెంకటేశ్వర రావు తలపై కర్రలతో దాడి చేశారు. దాంతో అతను కింద పడిపోయారు. విలువైన వస్తువులు తీసి ఇవ్వాలని వారు వెంకటేశ్వర రావు భార్యను హెచ్చరించారు. ఆమె అందుకు తిరస్కరించడంతో కత్తితో దాడి చేశారు.
దుండగులు కంటైనర్‌ను తెరిచి 40 వేల రూపాయలు తీసుకున్నారు. దంపతులు గత రెండేళ్లుగా వారు పొదుపు చేసి వాటిని పోగు చేసుకున్నారు. ఆ తర్వాత దుండగులు ధనలక్ష్మి ఆభరణాలను లాక్కున్నారు. ముఠా సభ్యులు హిందీలోనూ తెలుగులోనూ మాట్లాడినట్లు వెంకటేశ్వర రావు చెబుతున్నాడు.
ఆ తర్వాత వెంకటేశ్వర రావు పక్కనే ఉన్న ఫామ్‌హౌస్ వాచ్‌మన్ వద్దకు వెళ్లి అప్రమత్తం చేశాడు. ఆ వాచ్‌మెన్ 110 నెంబర్‌కు కాల్ చేసి, వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. ఆ ఫామ్‌హౌస్ అనంతసేనా రెడ్డి అనే వ్యక్తికి చెందింది.












Click it and Unblock the Notifications