గొడవపడి నడిరోడ్డుపై దంపతుల ఆత్మహత్యాయత్నం

వివరాల్లోకి వెళితే.. మనోహర్, సువర్ణ అనే దంపతులు రోడ్డుపై గొడవపడ్డారు. మనోహర్.. సువర్ణను మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె సమీపంలోని దుకాణంలోకి వెళ్లి బ్లేడు కొనుగోలు చేసింది. దాంతో ఆమె మెడపై కోసుకుంది. గమనించిన మనోహర్ తాను కూడా బ్లేడుతో చేయి కోసుకున్నాడు.
తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై దాడి: బంగారు గొలుసు అపహరణ
ప్రకాశం: ఒంటరిగా వెళుతున్న మహిళపై దాడి చేసిన దుండగులు, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో జరిగింది. దుండుగల దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications