వల్లభనేని వంశీకి బ్యాడ్ న్యూస్.. బెయిల్ వచ్చినా జైల్లోనే

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు.

అయితే, తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది. గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరంలోని ఆత్కూర్‌ పీఎస్‌లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారించింది.

Court grants bail to YSRCP leader Vallabhaneni Vamsi

ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. వంశీకి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ.. వంశీ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే వంశీ బయటికి వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు కాకపోతే ఆయన బయటికి రానట్లేనని తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ వచ్చిందనే ప్రచారంతో ఆయన ఇంటికి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+