కెసిఆర్‌పై వ్యాఖ్యలు: పవన్ కళ్యాణ్‌పై కేసుకు ఆదేశాలు
నిజామాబాద్: జనసేన అధినేత, తెలుగు సినిమా హీరో పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ కోర్టు డిచ్‌పల్లి పోలీసులను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అద్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రవి కుమార్ ఇక్కడి కోర్టులో పిటిషన్ వేశారు
పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేసి జూన్ 11వ తేదీలోగా నివేదక ఇవ్వాలని కూడా కోర్టు డిచ్‌పల్లి పోలీసులను ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్‌పై 163 (ఎ)స 506 సెక్శన్ల కింద కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపి తరఫున తెలంగాణలో విస్తృతంగా ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాట తీస్తానంటూ ఆయన హెచ్చరించారు.
బిసి నేతలపై తిట్ల దండకం వినిపిస్తున్న కెసిఆర్... బిసి వ్యతిరేకి పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెసు నేత షబ్బీర్ అలీకి తానంటే చాలా కోపమని పవన్ అన్నారు. ఆయన తనను తిట్టినా పర్లేదన్నారు. ఆంధ్రాభవన్‌లో ఆంధ్రులపై మరోసారి దాడులు జరిగితే తన అసలు స్వరూపం చూస్తారని తెరాసను హెచ్చరించారు. తాను ప్రజల కోసం వచ్చానని, నిండు ప్రాణాలు బలవుతుంటే, న్యాయం జరగక పోవడంతో బాధతో, అసహనంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.












Click it and Unblock the Notifications