ప్రేమ పేరుతో అమ్మాయికి వంచన: ఎస్ఐ పెళ్లికి కోర్టు బ్రేక్
కర్నూలు/హైదరాబాద్: అలిపిరి ఎస్‌ఐ గణేశ్ పెళ్లిని ఆపాలని పోలీసులకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలిపిరి ఎస్‌ఐ గణేశ్‌పై ఎమ్మిగనూరు కోర్టులో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తనను ప్రేమ పేరుతో వంచించాడని ఆరోపించింది. ఆ మహిళ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు విచారణ జరిపింది.
ఆదివారం మంత్రాలయంలో జరగబోయే గణేశ్ పెళ్లిని ఆపాలని పోలీసు అధికారులను కోర్టు ఆదేశించింది. విచారణ జరపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికై లోకాయుక్తలో ఎస్‌ఐపై మహిళ ఫిర్యాదు చేసింది.

భవనంపై నుంచి బాలుడి మృతి
కాగా, సికింద్రాబాద్ గాంధీనగర్‌లోని భవనంపై నుంచి పడి 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. భవనంపై నుంచి గాలిపటం ఎగురవేస్తూ బాలుడు జారిపడ్డాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హత్నూర మండలం చందాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను గుండ్లమాచనూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications