ఏపీలో కరోనా: తగ్గిన వైరస వ్యాప్తి -కొత్తగా 551 కేసులు, 4మరణాలు -అదుపులో యాక్టివ్ కేసులు

కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసులు క్రమంగా తగ్గుతుండటంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో డిశ్చార్జిలు పెరుగుతుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది...

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 56,187 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 551 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,72,839కి చేరింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 108 కొత్త కేసులు, గుంటూరులో 89, వెస్ట్ గోదావరి 58, ఈస్ట్ గోదావరిలో 57 కొత్త కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 3 కొత్తకేసులు నమోదయ్యాయి.

covid-19: 551 new cases, 4 deaths in the last 24 hours, aps tally reaches 8.72 lakh

ఏపీలో కొత్త కేసులతోపాటు కరోనా మరణాలు కూడా తగ్గాయి. గత 24 గంటల్లో నలుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు కరోనాతో కన్నుమూశారు. ఇప్పటివకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 7,042కు చేరింది. మరోవైపు..

కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండగా, డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 744 మంది డిశ్చార్జ్ అయ్యారు. తద్వారా ఇప్పటిదాకా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,60,368 కు పెరిగింది. ఇక యాక్టివ్‌ కేసులు 5,429గా కొనసాగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఇప్పటివరకు 1,05,09,805 టెస్టులు నిర్వహించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+