ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3
కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య, మరణాలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. అదే సమయంలో డిశ్చార్జీలు కూడా పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, రాష్ట్రంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం వైరస్ వ్యాప్తి ఉధృతి ఇంకా తగ్గలేదు.

ఇవీ తాజా లెక్కలు..
ఏపీ ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తవాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,38,363కు మరణాల సంఖ్య 6,768కు పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 2,452 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,09,770కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,825గా ఉంది.

జిల్లాల వారీగా ఇలా..
గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 401 కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 323, పశ్చిమగోదావరి 298, కృష్ణా జిల్లా 298, చిత్తూరు 253, అనంతపురం 161, విశాఖపట్నం 142, కడప 132, నెల్లూరు 121, ప్రకాశం 108, విజయనగరం 79, శ్రీకాకుళం 71, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 11 మంది చనిపోగా, అందులో, కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

టాప్ 2 నుంచి 3కి దిగింది..
కరోనా టెస్టుల విషయంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 79,601 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 85.07లక్షలకు చేరింది. నిన్నటి వరకు మహారాష్ట్ర(17.03లక్షల కేసులు) తర్వాత దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్(8.35లక్షల కేసులు).. శుక్రవారం నాటికి మూడో స్థానానికి దిగడం గమనార్హం. ప్రస్తుతం కర్ణాటక (8.38లక్షల కేసులు) రెండో స్థానానికి వెళ్లింది.












Click it and Unblock the Notifications