ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ వైరస్ బారినపడి చనిపోతోన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు డిశ్చార్జీలు పెరగడం, యాక్టివ్ కేసులు తగ్గుతుండటం శుభపరిణామం.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 59,671 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 319 మంది పాజిటివ్‌గా తేలారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,84,490కి చేరింది.

 covid-19 in ap: 319 new cases, one death in last 24 hrs, tally reaches to 8,84,490

ఆరు నెలలకుపైగా ఏపీలో కరోనా మరణాలు తీవ్రస్థాయిలో కొనసాగగా, గతేడాది నవంబర్ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఏడు నెలల కష్టంగా.. ఇవాళ ఒక మృతి కేసు మాత్రమే నమోదైంది. కృష్ణా జిల్లాలో ఆ కేసు నమోదైంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మాకృష్ణారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,127కు చేరింది. మరోవైపు..

రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య కూడా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 308 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం డిశ్చార్జీల సంఖ్య 8,74,531కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,835కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,22,24,202 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక..

వైద్య శాక తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. కొత్త కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో, అత్యల్పంగా విజయనగరంలో నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో శుక్రవారం 46 కేసులు రాగా, విజయనగరంలో 5 కొత్త కేసులు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+