వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మంగళవారం పెరుగుదల కనిపించింది. అయితే, డిశ్చార్జిలు కూడా అటు ఇటుగా ఉండటంతో యాక్టివ్ కేసులు కనిష్టానికి పడిపోయాయి..

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామబ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 50,794 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,81,599కి చేరింది.

 covid-19 in ap: 326 new cases, 2 deaths in last 24 hrs, push toll to 7,100

రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. సోమవారం నలుగురు ప్రాణాలు కోల్పోగా, మంగళవారం మాత్రం ఇద్దరే మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,100కు చేరింది.

కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్

రికవరీ రేటు మెరుగ్గా ఉన్న ఏపీలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయాయి. మంగళవారం 364 మంది కోవిడ్‌ వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,71,116కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,383కు పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

మంగళవారంనాటి లెక్కల్లో.. అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మంగళవారం 67 కేసులు వచ్చాయి. ఇక, విజయనగరంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, రెండు రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వచ్చాయి. గత రెండ్రోజులుగా విజయనగరం జిల్లాలో సున్నా కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రెండు కేసులు వచ్చాయి.

English summary
Andhra Pradesh reported 326 fresh cases of coronavirus, 364 recoveries and two deaths in 24 hours ending 9 AM on Tuesday. The latest bulletin said the total confirmed positives in the state so far rose to 8,81,599 after a total of 1.17 crore samples were tested, with an overall infection positivity rate of 7.53 per cent. The total recoveries increased to 8,71,116 and the toll to 7,100. The state now has 3,383 active Covid-19 cases, the bulletin said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X