వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 478 కేసులు, 3మరణాలు -ఈనెల25 నుంచే వ్యాక్సినేషన్

|
Google Oneindia TeluguNews

ప్రతి పది లక్షల మందిలో రెండు లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించిన, దేశంలోనే టీపీఎంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. టెస్టుల జోరు యధావిధిగా కొనసాగుతున్నా, కొత్త కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఈనెల 25 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు..

ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలుఏలూరు మిస్టరీ వ్యాధికి కారణమిదే -జగన్ చేతికి ఎయిమ్స్, ఐసీటీ రిపోర్టులు -సీఎం కీలక ఆదేశాలు

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెలువరించిన కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64,099 మందికి టెస్టులు నిర్వహించారు. తద్వారా మొత్తం టెస్టుల సంఖ్య 1,10,01,476కు చేరింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 478 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,76,814కి చేరింది.

 covid-19 in ap: 478 new cases 3 deaths and 715 recoveries in last 24 hours

కరోనా మరణాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. బుధవారం కరోనా మహమ్మారి బారిన పడి ముగ్గురు మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ కడపలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,067కు చేరింది. అలాగే,

జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్జగన్‌కు బీజేపీ అనూహ్య సవాల్ -చర్చిల నుంచి వసూళ్లు -సోము వీర్రాజు సంచలనం -పవన్ ఫ్యాక్టర్

కొత్త కేసులు, మరణాలు తగ్గడంతోపాటు ఏపీలో డిశ్చార్జిల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం 715 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,65,327కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,420గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. మరోవైపు..

Recommended Video

CM YS Jagan Meets Home Minister Amit Shah

ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వబోతున్నట్లు సర్కారు పేర్కొంది. సీఎం జగన్ ఆదేశాలతో మొత్తం 4,762 ఆరోగ్య కేంద్రాల్లో ఈ వాక్సినేషన్ జరుగనుంది. ఈ మేరకు వ్యాక్సినేష్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ట్రైనిగ్ కూడా ఇస్తున్నారు.

English summary
Andhra Pradesh reported 478 fresh Covid-19 cases, 715 recoveries and three deaths in 24 hours ending 9 am on Wednesday, state health department told. With this, the total positives so far went to 8,76,814, gross recoveries to 8,65,327 and deaths to 7,067.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X