ఏపీలో విస్తరిస్తున్న కరోనా.. ఆ జిల్లాలో మరో ఇద్దరికి..? రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
కరోనా మహమ్మారి ఏపీలో రీ ఎంట్రీ ఇచ్చింది. 2020లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన కొవిడ్-19 మరోసారి విజృంభించేందుకు సిద్ధమైంది. ఏపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఇద్దరికి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మే 22న విశాఖపట్నంలో తొలి కరోనా కేసు నమోదైంది. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఈమెతో పాటు భర్త, పిల్లలకు కూడా వచ్చి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అందరికీ వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారం రోజులు పాటూ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ అడ్వైజరీను ఏపీ ఆరోగ్య శాఖ జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలు ఏమి చేయొద్దు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్‌పోర్ట్ ల్లో మాస్క్ వేసుకోవడం, దూరం గా ఉండటం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన పెద్ద వాళ్లు, గర్భవతులు ఇంట్లోనే ఉండాలి .. బయటకు రావొద్దు. చేతులు తరచూ కడుక్కోవాలి, దగ్గు లేదా తుమ్ము వస్తే నోరు కప్పుకోవాలి, ముఖాన్ని తాకకుండా చూడాలి.
మాస్క్ వేసుకోండి - బహిరంగంగా ఎక్కువ మంది ఉన్న చోట్ల మాస్క్ ధరించడం చాలా అవసరం. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కోవిడ్ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లకండి - ఇతరులకు వ్యాపించకుండా చూసుకోండి. అదే సమయంలో అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.

మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉంచాలి. 24 గంటల పరీక్షల సదుపాయం కలిగిన ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలి. ప్రతి జిల్లాలోని వైద్యాధికారులు అప్రమత్తం కావాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు.












Click it and Unblock the Notifications