గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం- ముగ్గురు జడ్జీలు, 12 మంది లాయర్లకూ
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో టాప్‌లో ఉన్న గుంటూరులో దాదాపు రోజూ వెయ్యి కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లా కోర్టులోనూ కరోనా కల్లోలం రేపుతోంది. దీంతో పలువురు న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారు.
గుంటూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవికి తాజాగా కరోనా సోకడంతో చనిపోయారు. ఆ తర్వాత మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులతో పాటు 12 మంది న్యాయవాదులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు రావాలంటేనే జడ్జీలు, లాయర్లు, కక్షిదారులు కూడా భయపడుతున్నారు. కోర్టు ఆవరణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

గుంటూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకినట్లు తాజా పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వీరిలో చాలా మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కక్షిదారులకూ కరోనా సోకడంతో వాయిదాలకు హాజరయ్యే పరిస్దితి కనిపించడం లేదు. ఇప్పటికే నగరంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా జిల్లా అధికారులు భారీగా ఆంక్షలు విధించారు. ఉదయం షాపింగ్ మినహాయిస్తే దాదాపుగా లాక్‌డౌన్ వాతావరణం కనిపిస్తోంది. అయినా కేసుల ఉధృతి మాత్రం ఆగడం లేదు. దీంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయమార్గాలపై దృష్టిపెట్టారు.
గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపుతోంది. కోర్టు అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవి వైరస్ సోకి మృతి చెందారు. ఇదే కోర్టులో పని చేస్తున్న ముగ్గురు జడ్జిలు, 12 మంది న్యాయవాదులు, పలువురు కోర్టు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.












Click it and Unblock the Notifications