• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతిలో కోవిడ్ పంజా; కిట్ల లేమి, వైద్యుల కొరతతో ఆసుపత్రులలో రోగుల ఇక్కట్లు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాను కరోనా మహమ్మారి వేధిస్తోంది. తిరుపతిలో విపరీతంగా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇదే సమయంలో తిరుపతి ఆసుపత్రిలో వైద్య సదుపాయాల లేమి, వైద్యుల కొరత ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. భయంకరమైన కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత లేకపోవడం గత కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాను వెంటాడుతోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, టెస్ట్ కిట్‌ల కొరత కారణంగా చాలా మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు.

పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నా పరీక్షల్లో పెరుగుదల లేదు

పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నా పరీక్షల్లో పెరుగుదల లేదు

పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నప్పటికీ, పరీక్షలను పెంచడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ఏడాది రెండవ వేవ్ సమయంలో జిల్లాలో అనేక సందర్భాల్లో 10,000 కంటే ఎక్కువ రోజువారీ పరీక్షలు జరిగాయి.

అయితే, ప్రస్తుత మూడవ వేవ్ సమయంలో, వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 5,000 కంటే తక్కువ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలలో కిట్ల కొరత వల్ల పరీక్షలు ఇవ్వకుండానే ప్రజలు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. కొందరు ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రతి పరీక్షకు సుమారు రూ. 2,000 వసూలు చేస్తున్నారు.

అనేక ఆసుపత్రులలో హోమ్ ఐసోలేషన్ కిట్‌ల కొరత

అనేక ఆసుపత్రులలో హోమ్ ఐసోలేషన్ కిట్‌ల కొరత

అలాగే, అనేక ఆసుపత్రులలో హోమ్ ఐసోలేషన్ కిట్‌ల కొరత ఉంది. పరీక్షల సంఖ్య మరియు ఇతర సమస్యల గురించి అధికారులు ఇప్పటివరకు ఏమీ మాట్లాడడం లేదు. పరీక్షల సంఖ్య, పాజిటివిటీ రేటు, హోమ్ ఐసోలేషన్‌లో ఎంత మంది ఉన్నారు, కోవిడ్ కేర్ సెంటర్‌లు మరియు ఆసుపత్రులలో అడ్మిషన్‌లు మరియు డిశ్చార్జెస్‌పై రోజువారీ డేటాపై కూడా తిరుపతిలో పారదర్శకత లేదు.

ఆస్పతుల్లో వైద్యుల కొరత.. కరోనా బారిన పడుతున్న వైద్యులు

ఆస్పతుల్లో వైద్యుల కొరత.. కరోనా బారిన పడుతున్న వైద్యులు

ఇక ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో వైద్యులు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. డాక్టర్లు వైద్య సిబ్బంది ఇప్పటికే వందలాది మంది కరోనా బాధితులుగా మారిన పరిస్థితి చోటు చేసుకుంది. స్విమ్స్ లో ఇప్పటికి 200 మంది కి పైగా కరోనా బారిన పడగా రుయా ఆస్పత్రిలో 120 మందికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. భారీగా వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడడంతో ఇతర జిల్లాల నుంచి తిరుపతి ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు సరిగా అందడం లేదు.

ఆస్పత్రులలో కరోనా రోగుల పాట్లు

ఆస్పత్రులలో కరోనా రోగుల పాట్లు

ఆసుపత్రుల్లో వైద్యులు లేక, వైద్య సదుపాయాలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్లకు కరోనా సోకడంతో రుయా ఆసుపత్రిలో తాత్కాలికంగా ఆపరేషన్ లకు సైతం విరామం ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందితో వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి మండలంలో పాజిటివ్‌ కేసుల సంఖ్యను మాత్రమే అందజేస్తున్నారు. దీంతో వైరస్ తీవ్రతపై పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే జిల్లాలో ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

కోవిడ్ కేర్ సెంటర్లను తెరవడంలో ఆలస్యం

కోవిడ్ కేర్ సెంటర్లను తెరవడంలో ఆలస్యం

ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి, లక్షణాలు ఉన్న రోగులు మరియు కరోనా పాజిటివ్‌ల యొక్క ప్రాధమిక పరిచయాలు పరీక్షించబడుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే, టెస్టింగ్ కిట్ల కొరతను ఆయన ఖండించారు. అంతేకాదు కోవిడ్ కేర్ సెంటర్లను తెరవడంలో ఆలస్యం కూడా ఒంటరిగా ఉండాలనుకునే రోగులకు సమస్యగా మారిందని సమాచారం.

జనవరి మొదటి వారంలోనే ఈ కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే బుధవారం, జిల్లాలో 1,822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి మునుపటి రోజు కంటే 288 ఎక్కువ. యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా 10,000 మార్కుకు చేరుకుంది. తిరుపతి అర్బన్‌, రూరల్‌లో కలిపి 542కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు అర్బన్‌లో 254, శ్రీకాళహస్తిలో 76, మదనపల్లిలో 66, పాకాలలో 50 కేసులు నమోదయ్యాయి.

English summary
Covid throws paw in Tirupati. Lack of kits and a shortage of doctors have made the condition of hospitals worse. shortage of doctors due to corona effected to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X