వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కోవిడ్ వారియర్స్ .. కరోనాపై వార్ లో మెడికల్ టీమ్స్ ను సిద్ధం చేసిన ఏపీ సర్కార్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పై పోరాటంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుతం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రెడ్ జోన్లకు సమీపంలో అత్యవసర క్వారంటైన్ సొరంగాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని సిద్ధం చేయిస్తున్న సర్కార్ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారికి ఆస్పత్రులకు తీసుకెళ్లకుండానే ఇక్కడే క్వారంటైన్ అందించేందుకు ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక అంతే కాదు 2 ఎలా మంది మెడికల్ , పారా మెడికల్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్ గా తయారుచేసింది .

చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా ... చిన్నోళ్ళ నుండి వృద్ధుల దాక స్టెప్పులు .. సాంగ్ వైరల్చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా ... చిన్నోళ్ళ నుండి వృద్ధుల దాక స్టెప్పులు .. సాంగ్ వైరల్

 కరోనా బాధితుల సేవల కోసం కోవిడ్ వారియర్స్

కరోనా బాధితుల సేవల కోసం కోవిడ్ వారియర్స్

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 365కు చేరుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య బాగా పెరిగితే వైద్యులు, ఇతర సిబ్బంది కొరత నెలకొనే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన ఏపీ సర్కార్ వైద్య సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా, 'కోవిడ్ వారియర్స్' పేరిట ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.

2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్లు, మెడికల్ ప్రాక్టీషనర్లతో టీమ్

2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్లు, మెడికల్ ప్రాక్టీషనర్లతో టీమ్

ఇప్పటివరకు 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు చేరారు. ఇక వీరితో పాటు ప్రైవేటు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఒకవేళ అవసరం అయితే వీరందరి సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది అవసరం ఉందని పేర్కొన్నారు కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ గిరిజా శంకర్ .

మెడికల్, డెంటల్ , పారా మెడికల్ కాలీజీల నుండి విద్యార్థులు

మెడికల్, డెంటల్ , పారా మెడికల్ కాలీజీల నుండి విద్యార్థులు

వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడటం కోసం ప్రభుత్వం 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, యునానీ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారికిఆహ్వానం పలికిందని విద్యార్థులు, వైద్యుల నుండి అనూహ్య స్పందన వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కేవలం వైద్య విద్యార్థులే కాకుండా, ఆసక్తివున్న మెడికల్ ప్రాక్టీషనర్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఇప్పటి వరకు 2వేల మంది వారియర్స్ కరోనాపై వార్ లో మేము సైతం అంటూ ముందుకు వచ్చారని పేర్కొన్నారు .

కరోనా వైరస్ పై ముందు చూపుతో వ్యవహరిస్తున్న సర్కార్

కరోనా వైరస్ పై ముందు చూపుతో వ్యవహరిస్తున్న సర్కార్

ఇక వీరందికి శిక్షణ ఇచ్చి మరీ వారిని కరోనా ఆసుపత్రుల్లోనూ , వైద్య విద్యార్థులను క్వారంటైన్ సెంటర్లలో సేవలకు వినియోగిస్తామని పేర్కొన్నారు . వారికి కరోనా వైరస్ ఉన్న పేషెంట్లకు ఎలా చికిత్స అందించాలో శిక్షణ ఇస్తామని వైద్య వలంటీర్లుగా పని చేసేందుకు ముందుకువచ్చేవారి ప్రయాణ ఖర్చులు, ఆహార భత్యాలు భరిస్తామని, వారికి పీపీఈ కిట్లు కూడా అందిస్తామని ఆమె వెల్లడించారు.ప్రైవేట్ వైద్యులకు , పారా మెడికల్ సిబ్బందికి వారి పనిని బట్టి జీతం ఇస్తామని పేర్కొన్నారు . ప్రభుత్వానికి అవసరం అయితేనే వీరి సేవలు వాడుకుంటామని చెప్పారు. ఇప్పటికే కఠిన నిబంధనలతో లాక్ డౌన్ కొనసాగిస్తూ , కరోనా పేషెంట్ల చికిత్స విషయంలో కూడా శ్రద్ధ వహించి సంచలన నిర్ణయాలతో ఏపీ సర్కార్ కరోనా కంట్రోల్ కోసం కృషి చేస్తుంది.

English summary
AP government is taking steps to reduce the shortage of medical staff. The latest is setting up a medical team named 'Covid Warriors'. So far over 2000 medical students, apprentices and medical practitioners have joined. private doctors, nurses and paramedics also interested . Chief Minister YS Jaganmohan Reddy is expected that all these services should be utilized if necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X