ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ సమ్మెను నివారించాలి .. నిధులిచ్చి ఆదుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈరోజు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మె నివారణ కోసం జగన్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని కార్మికులను తొలగించటం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ.6,263 కోట్లకు చేరుకున్నాయనీ, వడ్డీల కిందే ఆర్టీసీ ఏటా రూ.కోటి చెల్లిస్తోందని తెలిపారు. ఆర్టీసీకి 2019-20 బడ్జెట్ లో రూ.3,700 కోట్లు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నెల 13న సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్మికుల 27 న్యాయమైన డిమాండ్లు సమ్మె నోటీసులో పేర్కొన్నామని ఆయన చెప్పారు.

CPI leader Ramakrishna writes letter to CM YS Jagan over APSRTC strike

ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సాకుతో సిబ్బందిని కుదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ పాలకమండలిలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి జూన్ 13న జరిగే సమ్మెను నివారించాలని మరోసారి కోరారు. ఆర్టీసీలో ఇప్పటికైనా ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. అన్నిటికంటే ముందు కార్మికులకు చెల్లించాల్సిన ఏరియర్స్ మొదటి ఇన్స్టాల్ మెంట్ లోనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+