చంద్రబాబు, పవన్ కూ అదే పరిస్దితి..! సీపీఐ నారాయణ అలర్ట్..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ క్రీడపై సీపీఐ జాతీయ నేత నారాయణ ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పైనా నారాయణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో గుద్దులాడుకుంటున్న ఇక్కడి పార్టీలు ఢిల్లీలో మాత్రం బీజేపీతో ముద్దులాడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ కొలువేనని, జగన్ కూడా మోడీ కొలువేనని నారాయణ తెలిపారు. పవన్ ఇంకా అసలు బోర్లా పడిపోయాడన్నారు. ఏపీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట కొనసాగుతోందన్నారు. ఉపరాష్ట్రపతినే సాగనంపేశారు, మీరో లెక్కా చంద్రబాబూ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మెహబూబా ముఫ్తీ బీజేపీతో అంటకాగి రాజకీయంగా నష్టపోయారని నారాయణ గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని చీల్చారని, ఇప్పుడు షిండే ఎక్కడున్నారని ప్రశ్నించారు.

తమిళనాడులో బీజేపీ రాజకీయాలతో అన్నాడీఎంకే కూడా అలాగే నష్టపోయిందని నారాయణ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ భయపడి బీజేపీకి అనుకూలంగా మారారన్నారు. రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా దీనికి అతీతులు కాదని గుర్తుచేశారు. అభయహస్తం అనుకుని వీళ్లు వెళ్తున్నారని, కానీ అది భస్మాసుర హస్తమని నారాయణ వ్యాఖ్యానించారు. కాబట్టి బీజేపీ రాజకీయాల్ని ఇతర పార్టీలు ఇప్పటికైనా అర్దం చేసుకోవాలని నారాయణ సలహా ఇచ్చారు. బీజేపీతో అంటకాగిన వారంతా రాజకీయంగా నష్టపోయారని నారాయణ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications