శవాలపై పేలాలు ఏరుకోవద్దు-కన్నుకు కన్ను కరెక్ట్ కాదు-సీపీఐ నారాయణ వ్యాఖ్యలు..!

పహల్గాం దాడి తర్వాత కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై సీపీఐ నారాయణ ఇవాళ తనదైన శైలిలో చురకలు అంటించారు. శవాలపై పేలాలు ఏరుకోవద్దంటూ కేంద్రానికి హితవు పలికారు. కన్నుకు కన్ను అనే విధానం కరెక్టే కాదని, సమస్య మూలాల్లోకి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఉన్న అంబేద్కర్ భవన్ లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటీలో నారాయణ మాట్లాడారు.

ఉగ్రవాదులుల్ని పెంచి పోషిస్తూ, యుద్ధానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్ కు గుణపాఠం తప్పదనే అంశంపై తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారాయణ మాట్లాడారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతమని, ఒక వ్యవస్థ కోసం వారు నక్సలిస్టులుగా మారారని నారాయణ తెలిపారు. అంతే కానీ, వారు శత్రుత్వం కాదన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత వరకు నక్సలిజం పోదన్నారు. నక్సలిజం అంతం పై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని కేంద్రానికి హితవు పలికారు.

cpi Narayana suggests pm modi to focus on terrorism rather than naxalism

టెర్రరిస్టులకు సిద్ధాంతం ఉండదని, అరాచకం సృష్టించడమే టెర్రరిజమని నారాయణ తెలిపారు. సిద్ధాంతాలను అంతం చేయాలి కానీ, వ్యక్తులను చoపడం వలన టేర్రరిజం నాశనం కాదన్నారు. టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు.చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని కోరారు. టెర్రరిజంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే, అందుకు ప్రధాని హాజరు కాకుండా, బీహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ప్రసంగించారని నారాయణ ఆక్షేపించారు.

టెర్రరిజం అంతం పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న తాము వారితో కలిసి పనిచేస్తామని నారాయణ తెలిపారు. టెర్రరిజం పై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలన్నారు. కత్తికి కత్తి, పన్నుకు పన్ను అనేది కరెక్ట్ కాదన్నారు. టెర్రరిజం మూలాలను అంతం చేయాలని కోరారు. శవాలపై పేలాలను ఏరుకోవడం మంచిది కాదని కేంద్రానికి హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+