Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతే రాజధాని-సీపీఐ మహాసభల్లో ఏకగ్రీవ తీర్మానం-జగన్ మాట మార్చారన్న నారాయణ..

ఏపీలో అమరావతి రాజధానికి ఇప్పటికే మద్దతునిస్తున్న సీపీఐ విజయవాడలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లోనూ ఇదే వాణి వినిపించింది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. దీనికి జాతీయ ప్రతినిధులు కూడా ఆమోదం తెలపడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఐ జాతీయ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి ఏకైక రాజధాని తీర్మానం

అమరావతి ఏకైక రాజధాని తీర్మానం

విజయవాడలో జరుగుతున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో అమరావతి అంశంపై విస్తృత చర్చ జరిగింది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడం, దాన్ని సమర్ధిస్తూ హైకోర్టు కూడా తీర్పు చెప్పిన నేపథ్యంలో అమరావతినే ఏకైక రాజధానిగా గుర్తించాలని సీపీఐ జాతీయ నేతలు భావించారు.

ఇందుకు అనుగుణంగానే జాతీయ మహాసభల్లో నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, జాతీయ మహాసభల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అమరావతి రైతులకు మద్దతు

అమరావతి రైతులకు మద్దతు

అలాగే అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు కూడా సీపీఐ జాతీయ మహాసభల్లో నేతలు మద్దతు తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్టచర్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూలంగా స్పందించి సత్వరమే నిర్మాణ పనులు కొనసాగించాలని నేతలు సూచించారు. జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు నిర్ణయించారు.

 నారాయణ కీలక వ్యాఖ్యలు

నారాయణ కీలక వ్యాఖ్యలు

విశాఖలో మొదలైన మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అమరావతికి గతంలో జగన్ ఆమోదం తెలిపి ఇప్పుడు మాట మార్చారన్నారు. దీంతో రాజధాని ఏదో ఏపీ ప్రజలు చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటిస్తే, నాడు జగన్ ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు.

మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని, బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ నారాయణ అభివర్ణించారు. విశాఖలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 విశాఖ గర్జన వైఫల్యంతో ఫ్రస్ట్రేషన్

విశాఖ గర్జన వైఫల్యంతో ఫ్రస్ట్రేషన్

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని, అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. తాము మాత్రం జాతీయ మహాసభల్లో చేసిన తీర్మానం మేరకు అమరావతిపై ఉద్యమిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+