ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు: మోడీకి రాజా హెచ్చరిక

న్యూఢిల్లీ: ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దీక్షకు సీపీఐ నేత రాజ ఆదివారం మధ్యాహ్నం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం అని చెప్పారు. అలాంటి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేయకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

CPI Raja demands Special Status for Andhra Pradesh

ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం సమాఖ్య వ్యవస్థ అంటారని, అది ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ పరిణామాలను ఏపీ ప్రజలు నిర్ణయిస్తారనిహెచ్చరించారు.

అంతకుముందు, వైసీపీ ఎంపీల దీక్షకు విజయమ్మ సంఘీభావం తెలిపారు. ఎంపీల ఆమరణ దీక్షలో న్యాయం, ధర్మం ఉందన్నారు. ఎంపీలు ప్రాణాలకు తెగించి దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏపీకి హోదా ఊపిరి అన్నారు.

ఊపిరి ఉన్నంత వరకు హోదాపై పోరాటం చేస్తామన్నారు. విభజన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. హోదాపై డిల్లీ పెద్దల్ని నిలదీయాలన్నారు. హోదా కోసం అందరు కలిసి రావాలన్నారు. వైయస్ బతికుంటే పోలవరం పూర్తయ్యేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+