సచివాలయ ఉద్యోగుల మరణాలు, 600 మందికి నోటీసులు-సీఎంకు సీపీఐ లేఖ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలో ప్రస్తుత కూటమి సర్కార్ ప్రక్షాళన చేపట్టింది. దీంతో పాటు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విధుల్లో మార్పులు జరుగుతున్నాయి. అలాగే వీరికి 16 రకాల సర్వేలతో పాటు ఎన్నికల విధులు కూడా అప్పగిస్తుండటంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు సచివాలయ ఉద్యోగుల మరణాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల బూత్ స్థాయి అధికారుల (BLO) విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 14 రకాల ఉద్యోగుల్ని బీఎల్వోలుగా నియమించాల్సి ఉండగా.. కేవలం సచివాలయ ఉద్యోగులనే నియమించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అలాగే 16 రకాల సర్వేలకు తోడు, ఎన్నికల విధుల పనిభారంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆరోపించారు. పని ఒత్తిడితో 2 నెలల కాలంలో నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించడం బాధాకరమన్నారు.

బూత్ స్దాయి ఉద్యోగులుగా పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల సస్పెండ్ కూడా చేయడం విచారకరమన్నారు. కర్నూలు జిల్లాలో 600 మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని సీపీఐ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. గతంలో విపక్షంలో ఉండగా సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు ఇవ్వొద్దని చంద్రబాబు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం రాగానే సచివాలయ ఉద్యోగుల గౌరవం పెంచుతామని చెప్పి, ఇప్పుడు 16 రకాల సర్వేలతో ఇంటింటికీ తిప్పి వారి ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్ధితి తెస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ఆయన సీఎం చంద్రబాబుకు సూచించారు. దీంతో సచివాలయ ఉద్యోగుల ఒత్తిడి వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు చెబుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications