"దీక్షపై పవన్ కల్యాణ్ ఎందుకు అలా అన్నారో తెలియదు"
అమరావతి: ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మాట మార్చారో తెలియదని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు అన్నారు. హోదాకు కట్టుబడి ఉన్నామని పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఆయన సోమవారం తెలిపారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూడకుండా తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. జనసేన ఆవిర్భావ సభలో ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలన్నీ వాస్తవమేనని అన్నారు. ఏప్రిల్ నుంచి ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు దూరమవుతున్నాయని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించిన పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదని ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో అనడం తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications