'పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి పని చేయడంపై నిర్ణయం వారిదే'
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో కలిసి పని చేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం నేత సీతారామ్ ఏచూరి బుధవారం తెలిపారు.
అమరావతి: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో కలిసి పని చేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం నేత సీతారామ్ ఏచూరి బుధవారం తెలిపారు.
ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో తీవ్రకరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒక్క తమిళనాడులో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 16 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు. ఆధార్ ఇబ్బందులతో 60శాతం మందికి రేషన్ దొరకట్లేదన్నారు. 2009లోనే ఈవీఎంలను వ్యతిరేకించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications