ఇవ్వకుంటే..: 800 మంది 'అమరావతి' రైతులకు సీఆర్డీఏ ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక విభాగంగా ఉన్న సీఆర్డీఏకు కొత్త కమిషనర్‌గా శుక్రవారం ఉదయం చెరుకూరి శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడారు.

 CRDA new commissioner ultimatum to capital area farmers

అందరూ చూస్తున్నారు, జాగ్రత్త: హోదాపై చంద్రబాబు సూచనలు

ఇప్పటికే నేలపాడులోని భూములకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. త్వరలో మిగిన 29 గ్రామాల్లోనూ ఈ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఇప్పటికైనా మిగిలిన 800 మంది రైతులు అంగీకరిస్తే భూసమీకరణ చేస్తామని లేదంటే 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేస్తామన్నారు.

మాకు శత్రువులే: కేశినేని నాని సంచలనం, బీజేపీ పైనా?, కేవీపీ ఫ్రెండ్
సెప్టెంబర్ నెలాఖరుకు రాజధాని భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. మరో పదిహేను గ్రామాల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణాయపాలెం వద్ద విట్, నీరుకొండ వద్ద ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం చేపడతామని, 2019 నాటికి సీడ్ క్యాపిటల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CRDA new commissioner ultimatum to capital area farmers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి