అమరావతి రైతులకు బంపరాఫర్: సింగపూర్‌కు 100 మంది, ఎందుకంటే, ఖర్చు ఇలా..
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొందరు సింగపూర్‌లో పర్యటించనున్నారు. వంద మంది రైతులను మూడు విడతల్లో సింగపూర్ పంపించేందుకు సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొందరు సింగపూర్‌లో పర్యటించనున్నారు. వంద మంది రైతులను మూడు విడతల్లో సింగపూర్ పంపించేందుకు సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: జూ.ఎన్టీఆర్‌కు బాబు సంకేతాలు, ముందుచూపు: హరికృష్ణకు కోపంవస్తే

సింగపూర్ పంపించేందుకు రైతులకు ఆహ్వానం
అక్టోబర్ 22న, నవంబర్ 5వ తేదీన, నవంబర్ 19వ తేదీల్లో.. ఇలా మూడు విడతల్లో 100 మంది రైతులకు సీఆర్డీఏ ఐదారు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు సింగపూర్ పర్యటనకు ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Recommended Video


మూడు విడతల్లో
తొలి విడత అక్టోబర్ 22 నుంచి 26 వరకు, రెండో విడత నవంబర్ 5 నుంచి 9 వరకు, మూడో విడత నవంబర్ 19 నుంచి 23 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. రైతులు అక్కడ సింగపూర్‌లో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలను సందర్శించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు.

ప్లాట్లు, వాణిజ్య సముదాయాల అభివృద్ధిపై అవగాహన
భూసమీకరణ కింద అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి రైతుల తిరిగి పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవచ్చనే అంశంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఆర్డీఏ నిర్వహించనుంది.

ఫ్లైట్, వీసా ఖర్చులు రైతులు చెల్లించేలా
మూడు విడతల్లో వెళ్లనున్న రైతులకు సింగపూర్‌లో వసతి, హోటల్ ఖర్చులను సిఆర్డీఏ భరించనుంది. అయితే విమాన టిక్కెట్, వీసా ఫీజులు మాత్రం రైతులు చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications