వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఎపి గురించి ఇంత జరుగుతుంటే...చిరంజీవి ఎక్కడా...?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో అల్లకల్లోలం జరుగుతుంటే కాంగ్రెస్‌ ఎంపి అయిన చిరంజీవి ఎక్కడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజ్యంగపరంగా ఏ హోదా లేని తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే రాష్ట్రానికి చెందిన ఎంపి అయ్యుండి చిరంజీవి
పోరాటంలో కనిపించడం అటుంచి కనీసం నోరు మెదపకపోవడం ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తోంది.

ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనక పోగా ఆదివారం రంగస్థలం ఆడియో వేడుకల్లో చిరంజీవి పాల్గొని స్పీచ్ లు దంచడం ఆయనపై విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. పార్టీ తరుపున పదవి తీసుకున్నప్పుడు ఏ పోరాటంలో నైనా ఆ పార్టీ తరుపున నైతిక బాధ్యతగా పాల్గొనాల్సిన చిరంజీవి...సొంత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ పార్టీలకు అతీతంగా పోరాడుతుంటే పట్టనట్లు సైలెంట్ గా ఉండటం దారుణమంటున్నారు రాజకీయ పరిశీలకులు.

చిరంజీవి ఎక్కడా...విస్మయం...

చిరంజీవి ఎక్కడా...విస్మయం...

ఎపికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎపికి చెందిన అన్ని పార్టీలు తిరుగుబాటు చేస్తుంటే...కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం ఎపి ప్రత్యేక హోదా మీదే నని అంటుంటే..అదే పార్టీ తరపున రాజ్య సభ ఎంపీగా ఉన్న ఎపి మెగాస్టార్ చిరంజీవి మాత్రం అసలు తనకు ఈ విషయంతో సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తుండటం ద్వారా చెప్పలేనంత అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. చిరంజీవికి నైతిక బాధ్యత లేదా?...ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నైనా ప్రత్యేక హోదా మీద స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా...చిరంజీవి మరీ ఇంత స్వార్థపరుడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 కాంగ్రెస్ పార్టీ అంత చేస్తుంటే...కనీస బాధ్యతగా...

కాంగ్రెస్ పార్టీ అంత చేస్తుంటే...కనీస బాధ్యతగా...

ఎపిలో భూ స్థాపితమైపోయిన దశలో కూడా ఈ ప్రత్యేక హోదాకు తోడ్పడటం ద్వారా తిరిగి పునరుజ్జీవం పొందుదామని కాంగ్రెస్ పార్టీ...ఆ పార్టీ నేతలు చచ్చీ చెడీ పోరాడుతుంటే...అదే పార్టీ నుంచి...ప్రత్యేక హోదా సొంత రాష్ట్రానికి ఎంత అవసరమో తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చిరంజీవి లాంటి వ్యక్తికి తగునా అని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పార్టీలో ఎంతో సీనియర్లు అయిన...వయసు పైబడిన కెవిపి లాంటి నేతలు సైతం ప్రత్యేక హోదా కోసం మేము సైతం అంటూ తమ వంతు తాముగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంటే...ఎంతో జనాకర్షణ కలిగిన...చిరంజీవి లాంటి వ్యక్తి సైలెంట్ గా ఉండి పోవడం ఏ రకంగా చూసినా సమంజసం కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 రిటైర్ అవుతున్నారా?...అయితే ఏంటి?...

రిటైర్ అవుతున్నారా?...అయితే ఏంటి?...

ఒకవేళ తాను రాజకీయాల నుంచి విరమించుకో దలిచినా...ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా...ఒక రాజకీయ పార్టీ నుంచి పదవిని అనుభవిస్తున్ననేతగా... ప్రత్యేక హోదా విషయమై తన అభిప్రాయం ప్రకటించాల్సిన బాధ్యత తప్పకుండా చిరంజీవిపై ఉందంటూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. పోనీ ఆయన ఘూటింగుల్లో బిజీగా ఉన్నారా అంటే అదీ లేదని నెటిజన్లే సమాచారం ఇచ్చేస్తున్నారు.

మంచి అవకాశం...ఇలానా చేసేది?....

మంచి అవకాశం...ఇలానా చేసేది?....

ఒకరకంగా చెప్పాలంటే నిజానికి ఇది చిరంజీవికి ఒక మంచి అవకాశం లాంటిది....తాను కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పదవిని పొంది ప్రజలకు ఏమీ చెయ్యలేదనే లోటును పూరించుకోవడానికి వచ్చిన ఒక అవకాశం. అంతేకాదు సరిగ్గా వినియోగించుకోగలిగితే కాంగ్రెస్ ను ఎపిలో కొంత బతికించడానికి తన వంతు సహకారం అందించడానికో...లేక తానే సొంతగా మరో ప్రత్యామ్నాయంలో కీలక పాత్ర పోషించడానికో ఉండే అవకాశాలను కొట్టిపడేయలేం. నిజానికి చిరంజీవికి అంతటి జనాదరణ ఉండేది. అయితే చిరంజీవి ఇదిగో ఇప్పుడు ఇంత కీలక సమయంలో వ్యవహరించిన తీరుగానే కనీస అవగాహన లేకుండా ప్రవర్తించడం వల్లే ఆయన అంతటి జనాదరణ వ్యక్తి రాను రాను అంత కనిష్ట పరిమితికి కుదించుకు పోతున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

English summary
The Congress party MP Chiranjeevi has been criticized for not being seen anywhere in this fight on the AP special status in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X