ఏపీ సంక్రాంతి కోడిపందేలు కొత్తపుంతలు.. క్రాస్ జనరేషన్ పుంజులతో పోరుకు రెడీ!!
సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అక్కడ జరిగే కోడిపందాలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కోడిపందాలు చూడ్డానికి ఎంతోమంది వెళుతుంటారు. వందల కోట్ల రూపాయలు పందేలు ఏపీలో సంక్రాంతి సందర్భంగా కొనసాగుతాయి. ఇక సంక్రాంతి కోడి పందేలకు కోళ్లను సిద్ధం చేయడానికి వాటికి ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తూ, శిక్షణనిస్తారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి క్రాస్ కోడిపుంజుల హవా కొనసాగ బోతుంది అన్న చర్చ ఏపీలో ప్రధానంగా జరుగుతుంది. ఈసారి గతం కంటే ఎక్కువగా కోడిపందాలు జరుగుతాయని టాక్ వినిపిస్తుంది.

ఏపీలో క్రాస్ జనరేషన్ కోడిపుంజుల హవా
ఒకపక్క కోడిపందాలు నిర్వహించవద్దని, కోళ్లకు కత్తులు కట్టి రక్తపాతం సృష్టించవద్దని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కోళ్లకు కత్తులు కట్టి, కుత్తుకలు తెంచే పుంజుల పోరాటాన్ని రక్తి కట్టించడానికి ఈ సంవత్సరం కూడా సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈసారి గతం కంటే భిన్నంగా కోడి పందాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. అమెరికన్ గేమ్ పాల్, అమెరికన్ పెర్విన్, బ్రెజిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి, దేశీయ డేగ, నెమలి వంటి జాతి కోళ్లతో క్రాసింగ్ చేశారు. ఇక ఈ క్రాసింగ్ ద్వారా వచ్చిన కోడి పుంజుల ధర లక్ష రూపాయలకు పైనే ఉందని సమాచారం.

పందెం కోళ్ళ పెంపకానికి కుటీర పరిశ్రమలు ..
కేవలం సంక్రాంతి కోడి పందేల కోసం అనేక కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈ క్రాస్ జాతి కోడిపుంజులను పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలలో కేవలం సంక్రాంతి కోడి పందాల కోసం 300 కోడిపుంజుల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి తర్ఫీదును ఇస్తున్నారు. అంతేకాదు వాటికి తర్ఫీదును ఇవ్వడానికి నెలకు 15 వేల రూపాయల చొప్పున జీతం ఇస్తూ 18 నెలలుగా వాటిని పందాలకు సిద్ధం చేస్తున్నారు. నాణ్యమైన పుంజు జాతులను తయారు చేస్తూ పందాలకు రెడీ అవుతున్నారు.

ఈ సారిగా జోరుగా కోడి పోరు.. క్రాస్ కోళ్ళ కొట్లాటకు బరులు సిద్ధం
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో కోడిపందేల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అన్నది ఒక అంచనా. అయితే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కోడి పందేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలకు ప్రఖ్యాతిగాంచిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు రెడీ కావడంతో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయని భావిస్తున్నారు. ఇక ఈ సారి క్రాస్ జనరేషన్ కోళ్ళతో కోడిపోరు రంజుగా ఉంటుందని భావిస్తున్నారు ఇప్పటికే కోనసీమ జిల్లాలలోనూ, గుంటూరు కృష్ణా జిల్లాల లోనూ కోడిపందాల నిర్వహణ కోసం పందాలను నిర్వహించడానికి బరులను సిద్ధం చేస్తున్నారు.
ఇక అనేక జిల్లాల్లో కోడి పందేల కోసం వచ్చేవారు ఇప్పటికే హోటళ్లను, లాడ్జీలు బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది.

కోడి పందేల కట్టడి కోసం రంగంలోకి పోలీసులు
ఇక కోడి పందేలను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రతి సంవత్సరం కోడిపందాల నిర్వహణ కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కోడి పందేలను కట్టడి చేయడం కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి జూదం నిర్వహించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు అనేక ప్రాంతాలలో తనిఖీలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications