వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం చెప్పే అన్ని పనులు సీఎస్ చేయాల్సిన అవసరం లేదు..! సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాన..!!

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం/హైదరాబాద్ : ముఖ్యమంత్రి చెప్పే ప్రతిపనిని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చేయాల్సిన అవసరం లేదని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముఖ్యమంత్రికి సిఎస్ సలహాదారు మాత్రమేనని తెలపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్వీ సుబ్రమణ్యంతో తాను కలసి పనిచేశానని, ఆయన చాలా నిబద్ధతతో పనిచేస్తారన్నారు. సిఎస్ పై నిందలు మోపడం ఆపాలని ధర్మాన అదికార పార్టీ నేతలుకు సూచించారు.

 సీఎస్ సలహాదారు మాత్రమే..! అన్ని పనులు ఎలా చేస్తారన్న వైసీపి..!!

సీఎస్ సలహాదారు మాత్రమే..! అన్ని పనులు ఎలా చేస్తారన్న వైసీపి..!!

ఐఏఎస్ అంటే ఐ అగ్రి సార్ అని అనమంటారుమీరు...అది కాదు వారి విధి అని వైసీపి నేత ధర్మన ప్రసాద రావు విమర్శించారు. చట్టప్రకారం పాలన నడుస్తుందనేది చెప్పడం వారి బాధ్యత అని చెప్పారు. చంద్రబాబు ఇటీవల వితండ వాదనలకు దిగుతున్నారని అన్నారు. తన వైఫల్యాలకు ప్రధానినరేంద్రమోదియే కారణం అని చెబుతుంటారని ఆరోపించారు. అదే ప్రధానిని దేశంలో ఎవరూ ప్రశంసించనంతగా చంద్రబాబు ప్రశంసించారన్నారు ధర్మాన.

 రాజ్యంగం మీద టీడిపి కి నమ్మకం లేదు..! అందుకే వ్యవస్తలను తప్పుబడుతోందని ధర్మాన విమర్శ..!!

రాజ్యంగం మీద టీడిపి కి నమ్మకం లేదు..! అందుకే వ్యవస్తలను తప్పుబడుతోందని ధర్మాన విమర్శ..!!

జగన్ మోహన్ రెడ్డి చివరకు ఈవీఎంలను కూడా తప్పుపడుతున్నట్టు అదికార పార్టీ నేతలు అభియోగాలు మోపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపిలో ఈసి నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వాదిస్తోందని, చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం చెబుతుంది ఇదేనా అని ప్రశ్నించారు. ఎన్నికల విధులు నిర్వహించే యంత్రాంగానికి ఎప్పుడైనా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం రాజ్యాంగం ఈసికి పూర్తి అధికారం ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

 ఈసీ అనేది ఓ స్వయం ప్రతిపత్తికలిగిన వ్యవస్థ..! ఆ వ్యవస్థను తప్పుబట్టడం మంచిది కాదన్న వైసిపి..!!

ఈసీ అనేది ఓ స్వయం ప్రతిపత్తికలిగిన వ్యవస్థ..! ఆ వ్యవస్థను తప్పుబట్టడం మంచిది కాదన్న వైసిపి..!!

అలా జరగకపోతే ప్రజలకు ఆ వ్యవస్థపై నమ్మకం పోతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చినపుడు ఈసి ఆదేశాలు పాటించాలా.? లేక ప్రభుత్వ ఆదేశాలు పాటించాలా? అని ప్రశ్నించారు. మన చట్టాలను గౌరవించక్కర్లేదని టీడిపి పాలన తెలియచేసిందన్నారు. రాజ్యాంగంపై తెలుగుదేశం ప్రభుత్వానికి నమ్మకం లేదని అన్నారు.

భావితరాలకు ప్రజాస్వామ్యం గౌరవం పోగొట్టొద్దు..! ధర్మాన ప్రభుత్వానికి హితవు..!!

భావితరాలకు ప్రజాస్వామ్యం గౌరవం పోగొట్టొద్దు..! ధర్మాన ప్రభుత్వానికి హితవు..!!

రాజ్యాంగం వ్యవస్దలను నాశనం చేశారని, స్పీకర్ వ్యవస్దను కూడా భ్రష్టు పట్టించారని టీడిపి ప్రభుత్వం పై ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి స్విస్ ఛాలెంజ్ పద్దతిని అమలు చేశారని, సివిల్ సర్వెంట్స్ ను హింసించే విధంగా వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదన్నారు. తర్వాత వచ్చే జనరేషన్ కు ఇదేనా మీరు ఇచ్చే సందేశం అని ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు.

English summary
Senior ysrcp leader Dharmana Prasada Rao said there is no need to do the chief secretary of the chief minister's every order. The Chief Minister is only a CS adviser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X