ఏపీలో పోలీస్ నెట్‌వర్క్‌పై సైబర్ ఎటాక్: హ్యాకింగ్‌తో స్తంభించిన విధులు..

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఏపీ పోలీస్ నెట్‌వర్క్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్ల పంజాతో శుక్రవారం మధ్యాహ్నాం నుంచి పోలీస్ నెట్ వర్క్ కంప్యూటర్లు స్తంభించిపోయాయి. చిత్తూరు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.

హ్యాకింగ్ పై తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. కంప్యూటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

cyber attack on ap police network

కాగా, ప్రపంచవ్యాప్తంగా 'వాన్నక్రై' పేరుతో రాన్సమ్ వేర్ అనే వైరస్ కొన్ని వందల దేశాల కంప్యూటర్లను హ్యాక్ చేయడంతో.. ఏపీలో నెట్ వర్క్ హ్యాక్ కూడా అందులో భాగంగానే జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

విండోస్ ఆపరేటింగ్ వాడుతున్న సర్వర్లే ఎక్కువ శాతం హ్యాకింగ్ బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 25శాతం కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవగా.. వాటిని డీకోడింగ్ చేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏపీలో పోలీస్ నెట్ వర్క్ వరుసగా పలు చోట్ల హ్యాకింగ్ గురవుతున్నట్లు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap police network was hacked by unknown persons. Chitturu, Srikakulam, Guntur police network was not working at present
Please Wait while comments are loading...