Cyclone Akvan: ఏపీకి భారీ ఊరట- తుఫాన్ యూటర్న్- అంతకంతకూ..!
రెండు రోజులుగా ఏపీని వణికిస్తుందని వాతావరణ విభాగం అంచనా భావించిన అక్వాన్ తుఫాన్ (Cyclone Akvan) కాస్తా యూటర్న్ తీసుకుంటోంది. అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుఫాన్ గా కూడా రూపాంంతరం చెందిన అక్వాన్ క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పుడు తుఫాన్ స్ధాయి నుంచి అల్పపీడనం స్ధాయికి మారిపోతోంది. దీంతో ఎల్లుండి తీరం దాటడం ఖాయమైనా బలహీన స్దాయిలో అప్పటికల్లా ఇది పూర్తిగా బలహీనపడుతుందని తాజా అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఏపీకి గండం తప్పినట్లేనని తెలుస్తోంది.
ఏపీ ప్రజలకు ఇవాళ భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. తుఫాన్ ఏపీ వైపు పయనిస్తున్నా.. ఇంతకు మించి తీవ్రమయ్యే సూచనలు లేవని తేల్చేసింది. దీంతో ఏపీకి గండం తప్పినట్లేనని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ వెదర్ మ్యాన్ సైతం మన రాష్ట్రం నుండి వీస్తున్న పొడి గాలి కారణంగా అక్వాన్ తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వెల్లడించారు. ఇది ఈ రోజు మరింత బలహీనపడి, 20వ తేదీ మధ్యాహ్నం బలహీన అల్పపీడనంగా తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ ప్రజలకు ఇది ఒక ఊరటగా తెలిపారు. తుఫాన్ మందగమనంతో కదల్లేని పరిస్ధితికి చేరినట్లు తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

AP Weatherman latest update on #CycloneAkvan :Good news for AP people as the Cyclone Akvan weakens into a Deep Depression due to the dry air feeding into it from our state. This will even weaken further today and might potentially make a landfall as a Weak Depression on 20th afternoon. A sigh of relief to AP people. Track details my team would be sharing soon as the consesnus arrived.
— Andhra Pradesh Weatherman (@praneethweather) November 18, 2026
ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిన అక్వాన్ తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా కదలడం ప్రారంభించి, నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇచ్ఛాపురం -బెరహంపూర్ ప్రాంతానికి చాలా దగ్గరగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వద్ద బలహీన అల్పపీడనంగా తీరాన్ని దాటనుందని వెదర్ మ్యాన్ తెలిపారు. నవంబర్ 19, 20 తేదీలలో శ్రీకాకుళం నగరం నుండి చిలక సరస్సు వరకు ఉన్న సరిహద్దు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో విశాఖపట్నం, విజయనగరం నగరాలు , సమీప ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి, రాత్రులు చల్లగా, తెల్లవారుజాము పొగమంచుతో కూడి ఉంటుందని తెలిపారు.
అంతకు ముందు మాత్రం ఏపీ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఇచ్చిన తుఫాన్ అప్డేట్ భిన్నంగా ఉంది. అక్వాన్ తుపాన్ నెమ్మదిగా కదులుతున్నట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. గత 6 గంటల్లో గంటకు 3 కిమీ వేగంతో ఇది కదిలిందని పేర్కొంది. ఇవాళ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 620 కి.మీ, విశాఖపట్నానికి 620 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతం అయి ఉందన్నారు. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు తాజా అప్డేట్ తో తుఫాన్ బలహీనపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
