Cyclone Ditwah: తరుముకొస్తున్న మరో తుఫాన్..! 5 జిల్లాలకు సర్కార్ అలర్ట్ ..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా, అనంతరం దిత్వా తుఫాన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని అనుకుని తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ తుపాన్ ఆంధప్రదేశ్ వైపుకు వస్తోంది. దీంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కాస్తా తీరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
ఏపీలోని తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాజా పరిస్దితిని హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. అనంతరం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. ఎక్కడ పాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచించారు. కాబట్టి ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు. శిథిలావస్థ స్థితిలోని ఇళ్లల్లో ఉండేవారిని గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి సూచించారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే రైతాంగం కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications