విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bharat Bandh: భారత్ బంద్ పై గులాబ్ తుపాన్ దెబ్బ-భారీ వర్షాలతో ఆందోలనలకు అడ్డంకి

|
Google Oneindia TeluguNews

గులాబ్ తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి వజ్రపుకొత్తూరు, కళింగపట్నం మధ్య తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో కుంభవృష్టి నమోదవుతోంది. దీంతో ఇవాళ జరగాల్సిన భారత్ బంద్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. బంద్ నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన నిరసనకారులు భారీ వర్షాలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్దితి నెలకొంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని నిరసిస్తూ రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇవాళ భారత్ బంద్ నిర్వహణకు సిద్దమయ్యాయి. అయితే అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆర్టీసీ బస్సు డిపోల వద్ద ఉదయం చేపట్టే నిరసనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినా విజయవాడతో పాటు పలు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీతో కలిసి నిరసనలు నిర్వహిస్తున్నాయి. భారీ వర్షాల్ని లెక్కచేయకుండా నేతలు అక్కడక్కడా రోడ్లెక్కారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండటంతో ఎక్కువసేపు నిరసనలు తెలిపే పరిస్ధితి లేకుండా పోతోంది.

cyclone gulab affect on bharat bandh in andhrapradesh, protests continue amid heavy rains

వాస్తవానికి ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా ఈ భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. అయితే భారీ వర్షాలతో వైసీపీ, టీడీపీ నేతలు బయటికి రాలేదు. దీంతో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు మాత్రమే అక్కడక్కడ నిరసనల్లో కనిపిస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నేతలు పరిమితంగా పాల్గొన్నారు భారీ వర్షం మధ్య గొడుగులతో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. విశాఖలోనూ అదే పరిస్ధితి నెలకొంది. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరసనల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటం వారికి ఇబ్బందిగా మారింది.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety

నిన్న రాత్రి గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటడంతో దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతోంది. వివిధ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకూ ఉన్న కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రాయలసీమలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఏపీ మధ్య తీరం దాటుతుందని భావించిన తుపాను కాస్తా ఏపీలోనే తీరం దాటింది. అదే సమయంలో అనుకున్న దాని కంటే ఎక్కువగా గులాబ్ తుపాను ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు పంపుతోంది.

English summary
landfall of cyclone gulaab seems to be affected today's bharat bandh call given by farmers unions in andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X