Cyclone Michaung: ఏపీ సీఎస్ అత్యున్నత సమీక్ష: భారీగా నిధులు విడుదల

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ సాయంత్రానికి బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాయలసీమ మొదలుకుని ఉత్తరాంధ్ర వరకూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

Cyclone Michaung: AP CS KS Jawahar Reddy review meeting with officials

నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, బాపట్ల.. జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. శనివారం మొదలైన వర్షాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తెరిపి ఇవ్వట్లేదు. ఆయా జిల్లాల్లోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి చెరువు మరోసారి నిండిపోయింది.

తుఫాన్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అధికారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల్లో స్థితిగతుల గురించి సీఎస్ ఆరా తీశారు.

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని జవహర్ రెడ్డి ప్రస్తావించారు. ప్రాణనస్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ అసాధారణంగా వర్షపాతం నమోదు అవుతోందని చెప్పారు.

Cyclone Michaung: AP CS KS Jawahar Reddy review meeting with officials

తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపించినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయిని భారత వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందిందని వివరించారు. తుఫాన్ తరువాత పరిస్థితుల కోసం తక్షణ చర్యల కోసం 22 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని అన్నారు.

ఇప్పికే లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, మరో నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నామని జవహర్ రెడ్డి చెప్పారు. 11,000 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, వారందరికీ ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+