ఈ 2నెలల్లో అతిపెద్ద తుఫాన్లు: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
ఏపీఎస్‌డీఎంఏ ఆధ్వర్యంలో ‘తుఫాన్ల సంసిద్ధత ’పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఏ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ(ఏపీఎస్‌డీఎంఏ) ఆధ్వర్యంలో 'తుఫాన్ల సంసిద్ధత 'పై వివిధ శాఖల అధికారులతో ఎండోమెంట్, ల్యాండ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రవిపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని ఏ క్షణం అయినా తుఫాన్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుఫాన్ల పై తరుచుగా సమావేశాలు నిర్వహిస్తామని లైన్ డిపార్టమెంట్ అధికారులు తుఫాన్లపై తీసుకుంటున్న చర్యలు గురించి సమావేశాల్లో నివేదిక అందించాలన్నారు.

తుఫాన్ల సమయంలో ముఖ్యంగా ప్రాథమిక అవసరాలు ఆహారం, నీరు, పునరావాసం, వైద్యం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. తీరప్రాంతంలోని స్కూల్స్, పెద్ద భవనాలు , ఇతర పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాను సమాచారం 24 గంటలు ముందుగానే ఖచ్చితంగా తెలుస్తుందని ముందస్తు చర్యలు ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ సూచనలు ఇచ్చారు. రైతులను క్రాప్ ఇన్సురెన్స్ లపై అవగాహన కల్పించలాని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. తుఫాన్ల సమయంలో అంటు వ్యాధులను అరికట్టడానికి తగిన మందులతో మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ ను కోరారు. పౌరసరఫరాల శాఖను ప్రతి జిల్లాలోనూ మూడు నెలలకు సరిపడా రైస్,షుగర్, గోధుమ పిండి తదితర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.
ఇరిగేషన్ శాఖను తుఫాన్లు, వరదల సమయంలో రిజర్వాయర్ నీటిస్థాయిలు తెలుసుకుని సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.బలహీనంగా ఉన్న రిజర్వాయర్లు, బ్రిడ్జిలు ముందుగానే మరమత్తులు చేయాలన్నారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించడానికి అవసరమైన క్రేన్లను,ఇతర పరికరాలతో సిద్ధంగా ఉండాలని ఆర్ అండ్ బి శాఖకు సూచించారు. మత్స్యకారులకు తుఫాన్ల హెచ్చరికలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఫిషరీస్ శాఖ అధికారులకు సూచించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, ఫైర్, ఏయిర్ ఫోర్స్ అధికారులను 24/7 తగిన బృందాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలకు తుఫాన్లను ఎదుర్కొడానికి కావాల్సిన ఇతర వనరులు,పరికరాలు గురించి అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించి ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications