జగన్ వద్దకెళ్లి తప్పుచేశా: దాడి రిజైన్, ఇప్పుడు టూరా?
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆయన మాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పు చేశానని, ఇప్పుడు రాజీనామా చేసి తన తప్పును సరిదిద్దికుంటున్నానని దాడి వీరభద్ర రావు అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పైన దాడి నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నారన్నారు. పార్టీలో చేరడం, జగన్‌ను సమర్థించడం తాను చేసిన తప్పు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి దానిని సవరించుకుంటున్నానని చెప్పారు.

ప్రస్తుతానికి కొన్నాళ్లు ప్రశాంతంగా ఉంటానని, ఆ తర్వాత తాను ఏ పార్టీలో చేరేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న గౌరవానికి జగన్ శాశ్వత సమాధి కట్టారన్నారు. ఓ వైపు ఎంపీలు పార్టీని వీడుతుంటే జగన్ మాత్రం విహారయాత్రకు బెంగళూరుకు వెళ్లాడని నిప్పులు చెరిగారు.
అందరినీ కలుపుకొని వెళ్లడం జగన్‌కు చేతకాదన్నారు. జగన్‌ను చూసి ప్రజలు అమ్మో జగన్ అంటున్నారన్నారు. నన్ను చూసి ఓటేయండి అనే అతివిశ్వాసం జగన్ ప్రదర్శించారన్నారు. చెల్లిని పక్కన తల్లికి విశాఖ టిక్కెట్ ఇచ్చారని, ఊరుకాని ఊరులో తల్లి తరఫున ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. విజయమ్మ కోసం జగన్ కేవలం గంట సేపే ప్రచారం చేశారన్నారు. నమ్ముకున్న వాళ్లను జగన్ నట్టేట ముంచారన్నారు.












Click it and Unblock the Notifications