ప్రజలకు చెప్పేశాం, కుదరదు: రాయల టిపై దామోదర
హైదరాబాద్: తమ పార్టీ హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇస్తుందని కృతజ్ఞత సభల్లో చెప్పుకున్నామని, సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారమే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంత్రుల బృందం (జివోఎం) సభ్యులకు బుధవారం లేఖ రాశారు.
ఢిల్లీ పెద్దలు రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి జివోఎంకు లేఖ రాశారు.

సిడబ్ల్యూసి ప్రకటన తర్వాత తాము తెలంగాణ జిల్లాల్లో కృతజ్ఞతా సభలు పెట్టి పది జిల్లా తెలంగాణ వస్తుందని ప్రజలకు చెప్పామన్నారు. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే కష్టమని, పార్టీకి నష్టమని లేఖలో పేర్కొన్నారు. పది జిల్లాల తెలంగాణే ఇవ్వాలన్నారు. త్వరగా బిల్లును తీసుకు రావాలని కోరారు. రాయల తెలంగాణను జివోఎం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం వాటిల్లుతుందన్నారు.
కెసిఆర్ కంటే ముందే దామోదర: జానా
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్లర చంద్రశేఖర రావు కంటే ముందే దామోదర రాయల టి వద్దన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చెప్పారు. ఈ సెషన్‌లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాయల టి వల్ల అన్ని ప్రాంతాలకు నష్టమేనని, పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని తాము జివోఎంకు లేఖ రాశామన్నారు. టి క్రెడిట్ మాదేనని, కాంగ్రెసు ఇప్పుడు తెలంగాణ ఇవ్వకుంటే మరో యాభై ఏళ్లకు సాధించేవారేమో అన్నారు.
మద్రాసు తెలుగు వారు, నిజాం తెలుగు వారు వేర్వేరుగా ఉండాలని కోరుకంటున్నామని, రేపటి బందుకు తమ మద్దతు ఉండదని, తమను ఎవరు సంప్రదించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరిగితే వెనక్కి పోయిందనే భావన ప్రజల్లో కలుగుతుందని జానా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీ ముందుండి పోరాడిందని చెప్పారు.
అబద్దపు వాదన: జెపి
తెలంగాణ ప్రజలను సీమాంధ్రులు దోచుకున్నారని, విడిపోతే ఉద్యోగాలు వస్తాయనేది అబద్దపు వాదన అని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. శాసన సభకు తెలంగాణ బిల్లు వస్తే వ్యతిరేకించాలని ఎపిఎన్జీవో ఆయనను కలిసి కోరింది. ఈ సమయంలో జెపి మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం లేకుండా విడిపోలేదన్నారు. ఢిల్లీ నేతలు తెలుగు ప్రజల గురించి ఆలోచించరని ధ్వజమెత్తారు.
తాము సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలను కలుస్తామని అశోక్ బాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను కూడా కలుస్తామన్నారు. అసెంబ్లీలో బలం లేకపోయినా జెపి మాటకు విలువ ఉంటుందన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications