డ్యాన్సులు వేసుకుంటూ..పూలు చల్లుకుంటూ ..రోజాపై బొండా ఉమా ఫైర్ ..ఇంకా ఏమన్నారంటే
నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై బంతి పూలు చల్లిన వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది . ఇక ఈ నేపధ్యంలో నగరి ఎమ్మెల్యే రోజాపై విమర్శలు గుప్పించారు బోండా ఉమా . నగరి ఎమ్మెల్యే రోజా కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి డ్యాన్సులు వేసుకుంటూ పూలు జల్లుకుంటూ బోరు ప్రారంభోత్సవానికి వెళ్ళటం దారుణం అని ఆయన విమర్శించారు . రూ. 2 లక్షలు ఖరీదు చేసే బోరు ప్రారంభోత్సవానికి వెళుతూ 200 మంది ప్రాణాలు పణంగా పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా నిప్పులు చెరిగారు .

కరోనా వ్యాప్తికి నగరి ఎమ్మెల్యే రోజా కారణం అని ఆగ్రహం
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి నగరి ఎమ్మెల్యే రోజా ఒక కారణమని అన్నారు. ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొన్న ఉమా రాష్ట్రంలో ఒకే రోజు 80 కరోనా కేసులు వచ్చాయని తెలిపారు. శ్రీకాళహస్తిలో బాధ్యత కలిగిన ఎమ్మెల్యే అయ్యి ఉండి బాధ్యతా రహితంగా ర్యాలీని చేపట్టడం వల్ల అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా కరోనా వచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదని బోండా ఉమా విమర్శించారు . జగన్ ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా విందులు, వినోదాలలో వైసీపీ నేతలు
ఇక మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని సామాజిక దూరం పాటించటం లేదని , కరోనా వ్యాప్తికి వీరే కారణం అని పేర్కొన్నారు బొండా ఉమా . వైసీపీ నేతల తీరుతో పసిపిల్లలకు పాలు కూడా దొరకడంలేదన్నారు.లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా విందులు, వినోదాలు చేసుకుంటున్నారని వైసీపీ నేతలకు చట్టాల మీద అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా . పక్క రాష్ట్రాల్లో పరిస్థితి మరీ ఇంత దారుణంగా లేదని అన్నారు. ఆదిమూలపు సురేష్ హైదరాబాద్‌కు వారంలో నాలుగు సార్లు వెళ్లి వస్తున్నారని మంత్రులకు మాత్రం క్వారంటైన్ విధించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
Recommended Video

ఇష్టారాజ్యంగా తిరుగుతున్న మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు
కనిగిరి ఎమ్మెల్యే అయితే బెంగళూరు నుంచి 50 మందిని వెంటేసుకుని విజయవాడకు వచ్చారని, కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేదని విమర్శించారు. చిత్తూరు నుంచి విశాఖ జిల్లా వరకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కుతూ పబ్లిసిటీ కోసం నానా చావు చస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు.ఇక వైసీపీ నేతలు అధికారమదంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ఈ దుస్థితికి వైసీపీ ఎమ్మెల్యేలే కారణమని బోండా ఉమా మండిపడ్డారు .












Click it and Unblock the Notifications